అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు(Afghan Cricket News) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హమీద్ షిన్వారీని.. ఆ పదవి నుంచి తాలిబన్లు తొలగించారు. అతడి స్థానంలో నసీబుల్లా హక్కానీని(Afghan Cricket Board Taliban) కొత్త డైరెక్టర్గా నియమించినట్లు షిన్వారీ సోషల్మీడియాలో వెల్లడించారు.
తాలిబన్ల అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ సోదరుడు అనస్ హక్కానీ తనను ఆ పదవి నుంచి తొలగించినట్లు తెలిపారు షిన్వారీ. అయితే తనను ఆ పదవి నుంచి తప్పించినందుకు తగిన కారణం చెప్పలేదని వాపోయారు. అదే విధంగా నసీబుల్లా హక్కానీని తమ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారిక ఫేస్బుక్ ఖాతా ప్రకటించింది.
క్రికెట్ సహా అన్ని రకాల క్రీడల్లో మహిళలను నిషేధిస్తూ చేసిన తాలిబన్లు చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అఫ్గానిస్థాన్లో మహిళలను క్రీడల్లో నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఆ దేశంతో జరగాల్సిన సిరీస్ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రద్దు చేసింది. ప్రస్తుతం దీనిపై ఇరుబోర్డుల మధ్య చర్చలు నడుస్తున్నాయి.
ఇదీ చూడండి.. New Zealand Cricket: న్యూజిలాండ్ జట్టుకు బాంబు బెదిరింపులు