టీ20 ప్రపంచకప్ 2022 కీలక సమరానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో నవంబరు 10న టీమ్ఇండియా సెమీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో మన జట్టు గెలవాలని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టే మనోళ్లు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ బౌలర్లు అర్షదీప్ సింగ్, షమీ, పాండ్య, భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో ఎన్ని సార్లు తలపడ్డారు.. అందులో విజయాలు, ఓటములు ఎన్ని తెలుసుకుందాం..
- గత రికార్డులను పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్ ముఖాముఖి పోరు ఇరు జట్లు 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు, ఇంగ్లాండ్ 10 సార్లు విజయం సాధించాయి.
- టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 3 సార్లు (2007, 2009, 2012) ఎదురెదురుపడగా.. భారత జట్టు 2, ఇంగ్లాండ్ ఒక్క విజయం సాధించాయి.
- మరోవైపు మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌కు చెత్త రికార్డు ఉండటం టీమ్ఇండియాకు అదనంగా కలిసొచ్చే అంశం. ఈ వేదికపై ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ20లో (2011) ఆతిథ్య జట్టుపై అతికష్టం మీద గెలిచింది.
- ఈ రికార్డులే కాక, అడిలైడ్‌లో కోహ్లీ వ్యక్తిగత రికార్డులు, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే వేదికలో బంగ్లాదేశ్‌పై విజయం, ఇంగ్లాండ్ ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం భారత జట్టుకు అదనంగా కలిసొచ్చే అంశాలు.
- అయితే మరోపక్క టీమ్ఇండియాను సమస్యలు కలవరపెడుతున్నాయి. రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం, దినేశ్ కార్తీక లేక రిషభ్ పంత.. వీరిద్దరిలో ఎవరిని తీసుకోవాలో తేల్చుకోలేకపోవడం.. స్పిన్నర్ల వైఫల్యం వంటివి భారత జట్టుకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి రేపటి మ్యాచ్‌లో భారత జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.
ఇదీచూడండి: T20 worldcup: టీమ్ఇండియాకు మళ్లీ భారీ షాక్.. నిన్న రోహిత్.. నేడు కోహ్లీ!