ETV Bharat / sports

T20 worldcup: కోహ్లీ కెప్టెన్​ ఇన్నింగ్స్​.. పాకిస్థాన్​ లక్ష్యం 152

author img

By

Published : Oct 24, 2021, 9:19 PM IST

Updated : Oct 24, 2021, 10:49 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. పాక్​ బౌలర్లలో షహీన్​ అఫ్రిది 3, హసన్​ అలీ 2 వికెట్లు తీశారు.

kohli
కోహ్లీ

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన తమ తొలి మ్యాచ్​లో భారత బ్యాటర్లు తడబడ్డారు. పాక్​​​ బౌలర్ల దెబ్బకు కోహ్లీ(57), పంత్​(39) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ముందు 7 వికెట్లు కోల్పోయి 152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన​ టీమ్​ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్​శర్మ(0), కేఎల్​ రాహుల్​(3).. తొలి రెండు ఓవర్లోనే షహీన్​ అఫ్రిది బౌలింగ్​లో వెనుదిరిగారు. ఐదో ఓవర్​లో సూర్యకుమార్​ యాదవ్​ హసన్​ అలీ బౌలింగ్​ షాట్​కు యత్నించి కీపర్​ రిజ్వాన్​ చేతికి క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. ఈ క్రమంలో తొలి పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది టీమ్​ఇండియా. ఆ తర్వాత ధనాధన్​ ఆడిన పంత్​(39), జడేజా(13), కోహ్లీ(57) నాలుగు, ఐదు, ఆరు వికెట్లుగా వెనుదిరిగారు.

పాక్​ బౌలర్లలో షహీన్​ అఫ్రిది 3, హసన్​ అలీ 2, షదాబ్​ ఖాన్, హరిస్​​​ రాఫ్​​ తలో వికెట్​ తీశారు.

ఇదీచూడండి: T20 worldcup 2021: టీమ్​ఇండియా పది ఓవర్లకు 60/3

Last Updated : Oct 24, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.