ETV Bharat / sports

T20 World Cup: పాక్​, కివీస్​ మధ్య రసవత్తర పోరు​.. ఫైనల్​కు చేరెదెవరో? - టీ20 ప్రపంచ కప్​ వార్తు

T20 World Cup Semifinal Pak Vs Nz: టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌ బుధవారం జరగనుంది. గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌, గ్రూప్‌-2లో రెండోస్థానంలో నిలిచిన పాకిస్థాన్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అద్భుత పోరాటంతో కివీస్‌.. అదృష్టం వరించి పాకిస్తాన్‌ సెమీస్‌కు దూసుకెళ్లగా ఫైనల్‌కు ఏ జట్టు చేరుతుందోననే ఆసక్తి నెలకొంది.

t20 world cup first semifinal pakisthan vs newzealand

author img

By

Published : Nov 8, 2022, 6:19 PM IST

T20 World Cup Semifinal Pak Vs Nz: టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌ న్యూజిలాండ్, పాకిస్థాన్‌ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరగనుంది. టోర్నీలో మంచి పోరాట పటిమతో న్యూజిలాండ్‌ జట్టు సెమీస్‌కు చేరింది. సూపర్‌-12 దశలో ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించిన కివీస్.. వర్షం కారణంగా ఇంగ్లాండ్‌తో పాయింట్లను పంచుకుంది. మిగతా రెండు మ్యాచ్‌లలో శ్రీలంక, ఐర్లాండ్​పై మంచి విజయాలు అందుకొని 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లు సాధించినప్పటికీ రన్‌రేట్‌ తక్కువగా ఉండడం వల్ల టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. రెండోస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది.సెమీస్ వరకూ నిలకడగా రాణిస్తున్నా..నాకౌట్​లో కివీస్ జట్టు తడబడుతోంది.

2015, 2019 వన్డే ప్రపంచకప్​లు, 2021 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్​లలో ఓటమి చవిచూసింది. ప్రపంచకప్​లో న్యూజిలాండ్​పై చాలాసార్లు పాకిస్థాన్​ పైచేయి సాధిస్తూ వచ్చింది. 1992 వన్డే ప్రపంచకప్ సెమీస్​లో కివీస్​ను ఓడించిన పాక్ జట్టు.. 1999లో ఇదే పునరావృతం చేసింది. 2007నాటి టీ20 ప్రపంచకప్ సెమీస్​లోనూ.. కివీస్​ను పాకిస్థాన్ ఓడించింది. ఈ సారి మాత్రం ప్రత్యర్థిని కట్టడి చేయాలని కివీస్‌ సారథి కేన్ విలియమ్సన్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. పాక్ బ్యాటింగ్ లైనప్​ను వీలైనంత త్వరగా కూల్చేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. పేస్ ద్వయం ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ.. ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్ ఆర్డర్​ను పడగొట్టడంలో కీలకంగా వ్యవహరించారు. డారిల్ మిచెల్ కూడా స్థాయికి తగ్గట్టు రాణిస్తే పాక్ జట్టును కట్టడి చేయవచ్చని కివీస్ అంచనా వేస్తోంది. బ్యాటింగ్ విభాగంలో సారథి విలియమ్సన్, ఫిలిప్స్‌ బాగా రాణిస్తున్నారు.

మరోవైపు అదృష్టం కొద్దీ సెమీఫైనల్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు.. నాకౌట్‌లో తన స్థాయికి తగ్గట్టు రాణించాలని ఉవ్విళూరుతోంది. పాక్ జట్టు కూడా బౌలింగ్ విభాగంలో బలంగానే ఉంది. షాహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే కీలక బ్యాటర్ల వైఫల్యం పాక్‌ జట్టును వేధిస్తోంది. సారథి బాబర్ ఆజమ్​ ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతూనే వచ్చాడు. మరో ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్ కూడా తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. మిడిలార్డర్‌ బ్యాటర్లు రాణించడం వల్ల దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరగలిగింది. సెమీస్‌లోనైనా బాబర్, రిజ్వాన్ మంచి ఆరంభాన్ని అందించాలని.. జట్టు ఆశిస్తోంది. గత ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్‌పై తమ రికార్డును దృష్టిలో పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.