ETV Bharat / sports

పొట్టి ప్రపంచకప్​లో రోహిత్- కోహ్లీ ఓపెనింగ్!

మరో నాలుగు నెలల్లో ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్​లో టీమిండియా జట్టులో ఎవరెవరు ఉండాలో ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్​ సూచించాడు. కోహ్లీ ఓపెనింగ్​ చేయాలని.. దాని ద్వారా తర్వాత వచ్చే బ్యాట్స్​మెన్లపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేశాడు హాగ్​.

kohli
కోహ్లీ
author img

By

Published : Jul 11, 2021, 4:01 PM IST

టీ-20 ప్రపంచకప్​కు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. చాలా జట్లు.. తమ జట్ల కూర్పుపై ఓ అంచనాకు వచ్చుంటాయి. చాలా మంది క్రికెట్​ విశ్లేషకులు.. ఏయే జట్లలో ఎవరెవరు ఉండాలో సూచనలు కూడా ఇస్తున్నారు. టీమ్​ఇండియాలో రోహిత్​ శర్మతో పాటు కేఎల్​ రాహుల్​ ఓపెనింగ్​ చేయాలని.. భారత మాజీ క్రికెటర్​, కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా చెబుతుంటే, కోహ్లీ ఓపెనింగ్​ చేయాలని అంటున్నాడు ఆసీస్​ మాజీ ప్లేయర్​ బ్రాడ్​ హాగ్​.

ఇటీవల ఇంగ్లాండ్​తో​ టీ-20 సిరీస్​లో కొన్ని మ్యాచ్​ల్లో ఓపెనింగ్​ చేసిన కోహ్లీ.. అవసరమైతే ఐపీఎల్​, టీ-20 ప్రపంచకప్​లోనూ తొలుత బ్యాటింగ్​కు రావడానికి సిద్ధమేనని చెప్పాడు. ఈ తరుణంలో.. స్వేచ్ఛగా బ్యాటింగ్​ చేసే విరాట్​, తర్వాత వచ్చే బ్యాట్స్​మెన్లపై ఒత్తిడి తగ్గిస్తాడని అంచనా వేశాడు హాగ్​.

''టీ-20 ప్రపంచకప్​లో ఇండియాపైనా అంచనాలు ఇవే. విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ ఓపెనింగ్​ చేయాలి. మిడిల్​ ఆర్డర్​లో దూకుడైన ఆటగాళ్లు ఉండాలి. అందుకే కోహ్లీ ఓపెనింగ్​ చేయడమే ఉత్తమం'' అని బ్రాడ్​ హాగ్ అన్నాడు.

ఇంకా ఎవరంటే..

ఐపీఎల్​ సహా టీ-20ల్లో ఆకట్టుకుంటున్న సూర్యకుమార్​ యాదవ్​కు వన్​డౌన్​లో చోటిచ్చాడు హాగ్​. నాలుగు, ఐదు స్థానాల్లో రాహుల్​, పంత్​.. ఆల్​రౌండర్లుగా హార్దిక్​ పాండ్యా, జడేజాలను ఎంచుకున్నాడు. పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్​లతో పాటు శార్దుల్​ ఠాకుర్​ల పేర్లు చెప్పాడు. యుజ్వేంద్ర చాహల్​కు కూడా తుది జట్టులో చోటిచ్చాడు.

బ్రాడ్​ హాగ్​ ఎలెవన్​: రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీ, సూర్యకుమార్​ యాదవ్​, కేఎల్​ రాహుల్​, రిషభ్​ పంత్​, హార్దిక్​ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్​ ఠాకుర్​, భువనేశ్వర్​ కుమార్, యుజ్వేంద్ర చాహల్​, జస్​ప్రీత్​ బుమ్రా.

ఇదీ చదవండి : 'లంక పర్యటనలో సరికొత్త చాహల్​ను చూస్తారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.