టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్(IND vs PAK T20 Match) ఆదివారం జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు పోరుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. తాజాగా పాక్(Pak squad t20 World Cup) తమ 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ జట్టు బలంగా కనిపిస్తోందని అన్నాడు. ప్రత్యర్థి జట్టుపై 100 శాతం గెలిచే అవకాశమున్నా.. ఆ జట్టును అశ్రద్ధ చేయకూడదని, అందులోనూ గేమ్ ఛేంజర్స్ ఉన్నారని అభిప్రాయపడ్డాడు.
"పాకిస్థాన్ జట్టు దృఢమైంది. వారి జట్టులో గేమ్ ఛేంజర్స్ ఉన్నారు. వారిపై గొప్ప ప్రదర్శన చేయాలి. టాప్ ఆటగాళ్లతో గొప్పగా ఆడాలని భావిస్తున్నా."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా సారథి.
దాయాది పోరులో 12-0 తేడాతో టీమ్ఇండియాదే పైచేయి. 7 వన్డేలు, 5 టీ20 ప్రపంచకప్‌లలో టీమ్ఇండియానే విజయం సాధించింది. పాకిస్థాన్ ఒక్క వరల్డ్ కప్మ్యాచ్లోనూ గెలవనప్పటికీ విరాట్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
హార్దిక్ బౌలింగ్ చేయొచ్చు..!
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya News) బౌలింగ్ ఫామ్‌పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. వార్మప్ మ్యాచ్‌ల ముందే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. అసలైన మ్యాచ్‌ల్లో హార్దిక్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని పేర్కొన్నాడు. తాజాగా అంశంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. హార్దిక్ బౌలింగ్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడని తెలిపాడు. కనీసం రెండు ఓవర్లైనా అతడు వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: