యూఏఈలో టీ20 ప్రపంచకప్పు జరగనున్న నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌పై(Ian Chappell news) కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్(Ian Chappell test career). పొట్టి ఫార్మాట్.. టెస్ట్ క్రికెట్‌పై నీలినీడలకు కమ్ముకుంటున్నాయని పేర్కొన్నాడు. సంప్రదాయ క్రికెట్‌ను తక్కువగా ఆడే దేశాలకు పొట్టి ఫార్మట్ సరిపోతుందని తెలిపాడు.
"సుదీర్ఘ ఫార్మాట్‌ను పొట్టి క్రికెట్ చాలా ప్రభావం చేస్తుంది. టీ20 టోర్నమెంట్లు కొన్ని రోజుల వ్యవధిలోనే పూర్తవుతాయి. అందువల్ల సుదీర్ఘ టెస్ట్ సిరీస్ కంటే ప్రస్తుత పరిస్థితుల్లో పొట్టి క్రికెట్‌పై చర్చలు జరపడం కూడా సులభంగా అయిపోతుంది. స్వల్ప వ్యవధిలో పూర్తయ్యే మ్యాచ్‌లు.. సంప్రదాయ క్రికెట్ ఆడని/తక్కువగా ఆడే దేశాలకు సరిపోతాయి. కాబట్టి రాబోయే టీ20 టోర్నమెంట్లో ఒమన్, పాపువా న్యూగినియా దేశాలకు ప్రవేశం కల్పించాలి. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్(యాషెస్) కాకుండా ఇతర దేశాలతో టెస్ట్ క్రికెట్‌ను పోల్చినప్పుడు టీ20 ఫార్మాట్ లాభదాయకమైంది."
- ఇయాన్ చాపెల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
పొట్టి ఫార్మాట్ వల్ల భవిష్యత్‌లో సంప్రదాయ క్రికెట్ ఆడే దేశాలు మాత్రమే.. టెస్ట్ మ్యాచ్ ఆడుతాయని ఛాపెల్(Ian Chappell news) అన్నాడు.
"ఈ అంశాలన్నీ భవిష్యత్ టెస్ట్ సిరీస్‌లను సంప్రదాయ క్రికెట్ ఆడే దేశాలే ఎక్కువగా ఆడుతాయనడానికి సూచన. తాజాగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్న దేశాలైన ఐర్లాండ్, అఫ్గానిస్థాన్‌లో సుదీర్ఘ ఫార్మాట్ అభివృద్ధి చెందడం కష్టం. ఆటగాళ్ల నైపుణ్యాలు, వ్యవస్థ అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులు లేవు. దీంతో సంప్రదాయ క్రికెట్ ఆడే దేశాలు.. కొత్త జట్లతో టెస్ట్‌లు ఆడటానికి నిరకరించవచ్చు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడమే ఇందుకు ఓ కారణం. కరోనాతో ఈ సమస్య మరింత తీవ్రమైంది" అని చాపెల్(Ian Chappell news) పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఫేవరెట్లుగా ధోనీసేన.. దిల్లీ కుర్రాళ్లు ఢీకొట్టగలరా?