ETV Bharat / sports

T20 world cup 2021: భారత్​, పాక్ మ్యాచ్​పై దిగ్గజాల అభిప్రాయాలు

టీ20 ప్రపంచకప్​లో (T20 world cup 2021) అక్టోబర్ 24న భారత్​ పాక్​తో తలపడనుంది. దాయాది దేశంతో మ్యాచ్ అంటే తగ్గపోరు ఉంటుంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే?

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్
author img

By

Published : Oct 23, 2021, 7:38 AM IST

టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021) చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ తలపదేది ఆదివారమే(అక్టోబరు 24). ఇప్పటికే ఈ మ్యాచ్‌ దేశంలో క్రికెట్‌ వేడిని పెంచేసింది. తాజాగా ఇరు దేశాలకు చెందిన దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్‌పై చర్చించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారత్‌ నుంచి గంగూలీ, కపిల్‌ దేవ్‌, అజహరుద్దీన్‌.. పాక్‌ నుంచి వసీమ్ అక్రం, యూనిస్‌ ఖాన్‌, మహ్మద్‌ ఆమిర్‌ ఈ మ్యాచ్‌ గురించి ఏమన్నారంటే?

T20 world cup 2021
సౌరభ్‌ గంగూలీ

"ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాక్‌పై భారత్‌ ఆధిక్యం 13-0 అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యర్థిపై అజేయంగా ఉన్న రికార్డును టీమ్‌ఇండియా కొనసాగిస్తుంది. ఈ జట్టులోని ఆటగాళ్లందరూ నిజమైన మ్యాచ్‌ విన్నర్లు. ప్రపంచకప్‌ గెలవాలనే పదేళ్ల నిరీక్షణకు ఈ జట్టు ముగింపు పలుకుతుందనే ఆశతో ఉన్నాం."

-సౌరభ్‌ గంగూలీ

T20 world cup 2021
కపిల్​ దేవ్​

"ఒక బౌలర్‌గా నేను... బుమ్రా ఈ టోర్నీలో అధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నా. అతను ముందుకొచ్చి వికెట్లు తీయడంతో పాటు దేశం కోసం టోర్నీని గెలిచే బాధ్యత భుజాలకెత్తుకోవాలి. మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలవాలి. జట్టులో అతనో విశిష్టమైన ఆటగాడు. భారత్‌, పాక్​ మ్యాచ్​లో అతను నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాడు.

- కపిల్‌ దేవ్

T20 world cup 2021
మహమ్మద్‌ అజహరుద్దీన్

భారత్​, పాక్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఎప్పుడూ భారీగానే ఉంటుంది. ఈ మ్యాచ్‌ చుట్టూ ఎన్నో ఊహాగానాలు నెలకొంటాయి, ప్రచారం సాగుతోంది. ఈ పోరులో టీమ్‌ఇండియానే స్పష్టమైన ఫేవరెట్‌. అదే వేదికల్లో ఐపీఎల్‌ ఆడిన భారత్‌కు పాక్‌ కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది"

- మహమ్మద్‌ అజహరుద్దీన్

T20 world cup 2021
వసీమ్‌ అక్రమ్‌

"అవును.. ప్రపంచకప్‌ల్లో మేం భారత్‌ను ఓడించలేదు.. కానీ ప్రపంచకప్‌లో అడుగు పెట్టేటప్పుడు ఈ విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది గణాంక నిపుణుడి పని. కానీ ఓ ఆటగాడిగా ఈ రికార్డు నన్ను కానీ లేదా ఏ పాకిస్థాన్‌, భారత్‌ ఆటగాన్ని కానీ ప్రభావితం చేయదనే అనుకుంటా. భారత్స్‌ పాక్‌ మ్యాచ్‌ ఎంతో కీలకమైంది. టోర్నీలో ఇదే పెద్ద మ్యాచ్‌"

-వసీమ్‌ అక్రమ్‌

T20 world cup 2021
మహమ్మద్​ అమిర్

విరాట్​ కోహ్లీ ఓ దిగ్గజం. ఎప్పుడూ నిలకడగా రాణించే అతని ఆటతీరు అద్భుతం. భారత్​, పాక్​ మ్యాచ్​పై ఎప్పుడూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అంతటి ఒత్తిడిలోనూ ఎలా సత్తాచాటాలో కోహ్లీకి తెలుసు.

-మహమ్మద్​ అమిర్

T20 world cup 2021
యూనిస్​ ఖాన్

ధోనీ మెంటార్​గా రావడం ఈ ప్రపంచకప్​లో భారత్​కు అధిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పాక్​ పరంగా చూస్తే ఈ మ్యాచ్​లో మా జట్టు గెలిచి టీ20 ప్రపంచకప్​లో భారత్ ఆధిపత్యాన్ని 1-5కి తగ్గిస్తుందని అనుకుంటున్నా. ఇలాంటి మ్యాచ్​ల్లో రాణించిన వాళ్లే దిగ్గజాలుగా ఎదుగుతారు"

-యూనిస్​ ఖాన్

ఇదీ చదవండి:T20 World Cup 2021: ప్రపంచకప్​లో టీమ్​ఇండియాకు సవాలు ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.