ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. ఈసారి బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొనట్లేదని చెప్పాడు. చాలారోజుల నుంచి బయో బబుల్‌లో ఉన్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇతడితో పాటే వార్నర్, కమిన్స్ కూడా బిగ్‌బాష్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
"బబుల్‌లో ఆడటం ఇది ప్రారంభ దశ మాత్రమే. ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. కానీ ఇందులో కొంచెం ఇబ్బందిగా ఉంది. మానసిక ఒత్తిడి నుంచి ఆటగాళ్లు బయటపడాలంటే కొన్నాళ్ల పాటు సాధారణ జీవితాన్ని గడపాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది" అని స్మిత్ చెప్పాడు.
ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా.. అది పూర్తవగానే ఐపీఎల్ కోసం యూఏఈలో అడుగుపెట్టింది. దీని తర్వాత స్వదేశంలో టీమ్ఇండియాతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు బయో సెక్యూర్ వాతావరణంలోనే ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఆ తర్వాత బిగ్ బాష్ లీగ్ జరగనుంది.
ఇవీ చదవండి: