ETV Bharat / sports

టీవీలోనూ క్రికెట్​ చూడని అమ్మాయి.. మినీ ఐపీఎల్​లో - trail bazers in ladies mini ipl

థాయ్‌లాండ్‌ అనగానే పర్యటక ప్రదేశంగానే అందరికి గుర్తుస్తుంది. కానీ.. యుద్ధ విద్యలకు సంబంధించిన ఆటలే ఈ దేశంలో ఎక్కువ. ఇక ఆసియా దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న క్రికెట్‌ గురించి ఒకప్పుడు ఇక్కడ ఊసే లేదు. అందులోనూ కనీసం టీవీల్లోనూ మ్యాచ్‌లను చూసే అవకాశమే లేదు. అలాంటి గడ్డ నుంచి వచ్చిన ఓ అమ్మాయి లైవ్‌లో క్రికెట్‌ ఆడే అవకాశాన్ని సంపాదించింది 24 ఏళ్ల థాయ్‌లాండ్‌ బ్యాటర్‌ ఆమే నటకాన్‌ చాంటమ్​‌.

natakan chantam is playing in mini IPL who came from thailand where has no tvs to watch cricket
టీవీల్లోనూ క్రికెట్​ చూడని అమ్మాయి.. మినీ ఐపీల్​లో
author img

By

Published : Nov 4, 2020, 7:53 AM IST

మహిళల ఛాలెంజర్‌ టోర్నీలో (మినీ ఐపీఎల్‌) స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టు తరఫున ఆడబోతోంది నటకాన్‌ చాంటమ్​‌. మినీ ఐపీఎల్‌ ఆడుతున్న తొలి అసోసియేట్‌ దేశ క్రీడాకారిణి ఆమే. క్రికెట్లో ఎదిగేందుకు నటకాన్‌ చాలా ఇబ్బందులు పడింది.

నాన్న సాయంతో..

మొదట బాస్కెట్‌బాల్‌ ఎంచుకున్నా ఆ తర్వాత క్రికెట్‌ వైపు ఆకర్షితురాలైన ఈ థాయ్‌ అమ్మాయి.. అప్పటి నుంచి ఇక వదల్లేదు. ఆరంభంలో ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయుడైన నాన్న సాయంతో వాటిని అధిగమించింది. విరాట్‌ కోహ్లి, మిథాలీ రాజ్‌లను ఆరాధ్యంగా భావించే ఈ థాయ్‌ అమ్మాయి.. క్రికెట్‌ పరికరాలను విదేశాల నుంచి తెప్పించుకుని ప్రాక్టీస్‌ చేసేది.

"థాయ్‌లాండ్‌లో టీవీల్లో క్రికెట్‌ లైవ్‌లో చూడలేం. లేకపోతే సామాజిక మాధ్యమాల్లో చూడాల్సి వచ్చేది. అంతేకాదు క్రికెట్‌కు సంబంధించిన ఏ పరికరమైనా భారత్‌ నుంచో ఆస్ట్రేలియా నుంచో దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఛాలెంజర్‌ టోర్నీలో ఆడే అవకాశం వస్తుందని ఊహించలేదు. ఎప్పుడెప్పుడు మినీ ఐపీఎల్‌లో ఆడతానో అనే ఉత్సాహంతో ఉన్నాను."

--నటకాన్​ ఛాంటమ్​

ఓపెనింగ్‌ బ్యాటింగ్‌తో పాటు పేస్‌ బౌలింగ్‌ చేసే నటకాన్‌ థాయ్‌ జట్టులో కీలక క్రీడాకారిణిగా ఎదిగింది. భారత్‌ వేదికగా జరిగిన నాలుగు దేశాల టీ20 టోర్నీలో థాయ్‌లాండ్‌-ఎ తరఫున భారత్‌ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ చాంటన్‌ 80 పరుగులు చేసి సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్‌పై ఆమె అర్ధసెంచరీతో మెరిసింది.

ఇదీ చూడండి:మహిళా టీ20 ఛాలెంజ్​ షెడ్యూల్​పై ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.