ఐసీసీ బుధవారం(నవంబర్ 17) టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC T20 Rankings 2021) విడుదల చేసింది. టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మళ్లీ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా అగ్రస్థానంలోనే ఉన్నాడు. రాహుల్ ఒక స్థానం దిగజారి ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇక టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన ఆస్ట్రేలియా జట్టులో కీలకంగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ ఏకంగా ఎనిమిది స్థానాలను ఎగబాకి 33వ ర్యాంకుకు చేరుకున్నాడు.



ఇదీ చదవండి:IND vs NZ: భారత్‌తో టీ20 సిరీస్‌కు కివీస్ స్టార్ పేసర్ దూరం