టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(virat kohli steps down as indian captain) తప్పుకోనున్నాడు. టీ20 ప్రపంచ కప్(t20 world cup 2021 india team) తర్వాత ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నానని.. ఇకపై టెస్టు, వన్డే సారథ్య బాధ్యతలపై ఎక్కువగా దృష్టిపెడతానని అతడు చెప్పాడు. ఈ అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాకయ్యారు. అయితే టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ తప్పుకోవడంపై తానూ ఆశ్చర్యానికి గురయ్యానని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. బీసీసీఐ నుంచి కోహ్లీ కెప్టెన్సీపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు చాలా కాలం కెప్టెన్‌గా ఉండటం కష్టమని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీపై బీసీసీఐ నుంచి ఎలాంటి ఎత్తిడి లేదు. బీసీసీఐ ఇలాంటి పనులు చేయదు. నేనూ ఆటగాడినే. ఆరేళ్లు కెప్టెన్‌గా పనిచేశాను. అర్థం చేసుకోగలను. కెప్టెన్ బాధ్యతలు బయటికి గౌరవంగా కనిపిస్తాయి. కానీ కెప్టెన్‌గా అంతరంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సచిన్, గంగూలీ, ధోనీ, కోహ్లీలకే కాదు రాబోయే కెప్టెన్లు కూడా అది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదో కష్టమైన బాధ్యత"
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
మనిషే.. మిషన్ కాదు..
గత 12-15 నెలలుగా కోహ్లీ ఉన్నత శిఖరాల నుంచి దిగివస్తున్నాడని గంగూలీ అన్నాడు. ప్రతి ఆటగాడు ఆటలో శిఖరాన్ని చేరి దిగివస్తాడని, అది సహజమని చెప్పాడు. గత 11 ఏళ్లుగా విరాట్ ఆడుతున్నాడు. ప్రతీ సీజన్లో గొప్పగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కోహ్లీ కూడా 'మనిషే.. యంత్రం కాదు' అని అన్నాడు. చాలా కాలం ఆటలో ఉన్నప్పుడు ఎత్తుపల్లాలు సహజమని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ఇండియా అక్టోబర్ 24న పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ధోనీ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టాక ఒక్క ఐసీసీ కప్ కూడా భారత్ గెలుచుకోలేదు. సారథిగా విరాట్‌కు ఇదే చివరి టీ20 అయినందున.. ఈసారైనా కప్పు గెలవాలని టీమ్ఇండియా ఊవ్విళ్లూరుతోంది.
ఇదీ చదవండి:T20 world cup 2021: భారత్, పాక్ మ్యాచ్‌పై దిగ్గజాల అభిప్రాయాలు