ETV Bharat / sports

ఇంగ్లాండ్​ పర్యటనకు సూర్య, పృథ్వీ షా..

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు పృథ్వీ షా, సూర్యకుమార్​ యాదవ్​, జయంత్​ యాదవ్​లకు ఇంగ్లాండ్​ నుంచి పిలుపొచ్చింది. అక్కడ పర్యటిస్తున్న టీమ్​ఇండియా.. టెస్టు టీంలో వీరికి చోటు దక్కింది.

author img

By

Published : Jul 24, 2021, 1:14 PM IST

surya
సూర్య

ఇంగ్లాండ్​లో​ పర్యటిస్తున్న భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయాలబారిన పడి పర్యటనకు దూరమైన నేపథ్యంలో వారి స్థానంలో మరో ముగ్గురు క్రికెటర్లు యూకేకు బయల్దేరనున్నారు. గాయాల వల్ల శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్‌లు ఇంగ్లాండ్​ సిరీస్​కు అందుబాటులో ఉండట్లేదు. వీరిస్థానంలోనే.. శ్రీలంకతో వన్డేసిరీస్‌లో రాణించిన బ్యాట్స్‌మెన్లు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు తోడు ఆఫ్‌ స్పిన్నర్ జయంత్‌ యాదవ్​ను తీసుకోనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

అయితే శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్య, పృథ్వీషాలను సిరీస్ ముగిసిన తర్వాత లేదా మధ్యలోనే యూకేకు పంపించాలా అనే విషయమై ప్రస్తుతం చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఇంగ్లాండ్​-టీమ్​ఇండియా ఐదు మ్యాచ్​లతో కూడిన టెస్ట్​ సిరీస్​ ఆడనుంది.

శ్రీలంక పర్యటనలో ఉన్న ధావన్​ నేతృత్వంలోని భారత రెండో జట్టు.. 25,27, 29 తేదీల్లో 3 టీ-20 మ్యాచ్​లు ఆడనుంది.

ఇదీ చూడండి: ఒకే మ్యాచ్​లో ఐదుగురు అరంగేట్రం.. అందుకే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.