టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా(Suresh Raina Dhoni) మధ్య అనుబంధం (Dhoni Raina friendship)గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటారు. అయితే మైదానంలో ప్రశాంతంగా ఉండే ధోనీ.. తనను తరచూ తిడుతుంటాడని రైనా తెలిపాడు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ధోనితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు సురేశ్ రైనా.
క్రికెట్ మైదానంలో తనకు ఇష్టమైన ఓ డైలాగ్‌తో(Dhoni favourite dialogue) ధోనీ తిడుతుంటాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలో మైదానంలో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు. ఓ మ్యాచ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన రైనా క్యాచ్ జారవిడవగా.. అసంతృప్తి వ్యక్తం చేసిన ధోనీ.. బంతిపై దృష్టిసారించాలని చెప్పినట్లు తెలిపాడు.
"ధోనీ ఎన్నిసార్లు తిట్టారో లెక్కలేదు. 'మైనే పెహ్లే హై బోలా థా సాలే' డైలాగ్ ధోనికి ఎంతో ఇష్టం. క్రికెట్ మైదానంలో ఈ డైలాగ్‌ను తరుచూ వాడుతుంటాడు. నన్ను కూడా అప్పుడప్పుడూ సరదాగా అలా అంటాడు."
- సురేశ్ రైనా
'ఆ విషయం ధోని దగ్గర నేర్చుకున్నా'
క్రికెట్ మ్యాచ్ ముగిసే వరకు ఆట పూర్తి కాలేదని ధోనీ చెబుతుంటాడని అన్నాడు. అలాగే తమ పూర్తి విశ్వాసంతో చివరివరకు పోరాడాల్సి ఉంటుందని.. ఆట ముగిసేలోపు వేడుకలు జరుపుకోవద్దని ధోనీ చెబుతుంటాడని చెప్పాడు రైనా. తుదివరకు ఆత్మవిశ్వాసంతో పోరాడాలనే విషయాన్ని ధోని నుంచి నేర్చుకున్నట్లు రైనా తెలిపాడు.
ధోనీ అంత సులభంగా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడానికి అంగీకరించడని.. తీరికగా ఉంటేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడని రైనా చెప్పాడు. మరి కొన్నిసార్లు మెసేజ్ చేస్తుంటాడని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: 'ధోనీభాయ్ నాకు స్నేహితుడు మాత్రమే కాదు'