SteveSmith stunning performance: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్.. ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఓ సిక్సర్‌ను నిలువరించే క్రమంలో అత్యద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీవీ చూస్తున్నంత వాళ్లంతా మంత్ర ముగ్ధులయ్యారు. అయినా, దాని ఫలితం చివరికి బూడిదలో పోసిన పన్నీరులా తయారైంది. ఎందుకంటే అది సిక్సర్‌గా నమోదైంది.
అసలేం జరిగిందంటే..
ఆదివారం రాత్రి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు టీ20 మ్యాచ్ ఆడాయి. ఈ సందర్భంగా తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి 164/6 స్కోర్ చేసింది. అనంతరం శ్రీలంక కూడా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 164/8 స్కోర్ సాధించింది. దీంతో మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అక్కడ లంక నిర్దేశించిన ఆరు పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది.
అయితే, సూపర్ ఓవర్‌కు ముందు శ్రీలంక 20వ ఓవర్ నాలుగో బంతికే స్టీవ్ స్మిత్ అసాధారణ ప్రదర్శన చేశాడు. చివరి ఓవర్‌లో లంక విజయానికి 19 పరుగులు అవసరం కాగా 18 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే నాలుగో బంతిని తీక్షణ (6) భారీ షాట్‌కు ప్రయత్నించగా ఆ బంతి బౌండరీ బయట పడేలా కనిపించింది. అయితే స్మిత్ బౌండరీ లైన్ వెంబడే పరిగెత్తుకుంటూ వచ్చి సిక్సర్‌గా నమోదయ్యే బంతిని అమాంతం గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకొని తిరిగి మైదానంలోకి విసిరాడు. ఆ సమయంలో అతడి కాలు బౌండరీ లైన్‌కు తగిలేటట్లు రీప్లేలో కనిపించడంతో అది సిక్సర్‌గా లెక్కలోకి వెళ్లింది. అలాగే స్మిత్ నేలపై పడగానే తలకు గాయమైనట్లు అనిపించింది. అతడు కాసేపు నొప్పితో బౌండరీ లైన్ బయటే విలవిలలాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అతడి కష్టం మొత్తం వృథాగా మారిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
-
Nasty one 😢🤞.
— Johnny (@Johnnysar77) February 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Take Care @stevesmith49 🐐❤️ pic.twitter.com/wBJnnvtVrq
">Nasty one 😢🤞.
— Johnny (@Johnnysar77) February 13, 2022
Take Care @stevesmith49 🐐❤️ pic.twitter.com/wBJnnvtVrqNasty one 😢🤞.
— Johnny (@Johnnysar77) February 13, 2022
Take Care @stevesmith49 🐐❤️ pic.twitter.com/wBJnnvtVrq
ఇదీ చూడండి: టీమ్ఇండియాపై అదరగొట్టి.. ఐసీసీ అవార్డుకు ఎంపికై