భారత పర్యటన సందర్భంగా క్రికెట్‌పై ద్వేషం కలిగిందని తెలిపాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ డామ్ బెస్. అయితే పర్యటనలో నేర్చుకున్న పాఠాలను మంచి ప్రదర్శన చేయడానికి ఉపయోగిస్తానని చెప్పాడు.
నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 17 వికెట్లు తీశాడు బెస్. కానీ, నిలకడలేమితో సతమతమయ్యాడు. దీంతో రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఈ పర్యటనలో ఇంగ్లాండ్‌పై 3-1తో సిరీస్ గెలుచుకుంది టీమ్ఇండియా.
"భారత పర్యటన తర్వాత తగిన విరామం తీసుకున్నాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నిజంగా క్రికెట్‌ను ద్వేషించడం మొదలుపెట్టాను. చాలా సార్లు ఒత్తిడికి లోనయ్యా. దాని నుంచి బయటపడటం ఎంతో అవసరం."
- డామ్ బెస్, ఇంగ్లాండ్ క్రికెటర్
ఇక, భారత్‌లో బయోబబుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బెస్ తెలిపాడు. అందులో కేవలం క్రికెట్ గురించే చర్చ నడిచేదని అన్నాడు. దాంతో మంచి ప్రదర్శన చేసినప్పుడు అంతా బాగానే ఉన్నా.. అలా జరగనప్పుడు పరిస్థితి కఠినంగా ఉండేదని వివరించాడు. ప్రస్తుతం కౌంటీల్లో బెస్ అదరగొడుతున్నాడు.
ఇదీ చూడండి: 'అభిమానులారా.. భారత్‌కు మన సహకారం అవసరం'