2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న (2025 Champions Trophy news) నేపథ్యంలో టీమ్ఇండియా హాజరవుతుందా? లేదా? అనే అంశంపై భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆ దేశంలో అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేటప్పుడు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు భద్రత విషయంలో అక్కడి పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా చాలా జట్లు వెనక్కి తిరిగివచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. గతంలో క్రీడాకారులపై దాడులు జరిగడం వల్ల ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన చెందాల్సి వస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి:Ind Vs Nz: టాస్ గెలిచిన టీమ్ఇండియా.. న్యూజిలాండ్ బ్యాటింగ్