టీ20 ప్రపంచకప్ సిరీస్ హోరా హోరీగా జరుగుతోంది. ఇందులో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో నాలుగు పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ ఓటమిపాలైంది. దీంతో తమ గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచిన అఫ్గాన్ జట్టు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. కాగా, ఓటమికి బాధ్యత వహిస్తూ అఫ్గానిస్థాన్ జట్టు కెప్టెన్‌గా రాజీనామా చేస్తున్నట్లు మహ్మద్ నబీ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
"మా టీ20 ప్రపంచకప్ ప్రయాణం ముగిసింది. ప్రపంచకప్‌లో వచ్చిన ఫలితాలు మాకు కానీ, మా అభిమానులకు కానీ నచ్చలేదు. అందుకే జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఇదే విషయాన్ని మేనేజ్‌మెంట్‌కు తెలిపాను. కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికీ.. ఆటగాడిగా మాత్రం జట్టులో కొనసాగుతాను. ఇన్నాళ్లూ నాకు మద్దతు ఇచ్చిన జట్టు సహచరులతో పాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు" అని నబీ ట్వీట్ చేశాడు.
వర్షం కారణంగా రెండు అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు మాత్రమే ఆ జట్టు ఖాతాలో చేరాయి. అయితే చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పనిచేసింది. నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదీ చదవండి: కోహ్లీ 'ఫేక్ ఫీల్డింగ్'పై బంగ్లా బోర్డు రియాక్షన్.. ఆ సంగతేంటో తేలుస్తామంటూ
నేను బౌలర్‌తో ఎప్పుడూ ఆడను.. కేవలం బంతితోనే ఆడతా: సూర్యకుమార్