ETV Bharat / sports

Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్​కు పెద్ద ఛాలెంజ్​ అదే! - సెహ్వాగ్​ గంగూలీ

కౌన్‌ బనేగా కరోడ్‌పతి.. ఈ షో ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు 12 సీజన్లు జరిగాయి. శనివారం నుంచి కేబీసీ 13వ సీజన్‌ మొదలైంది. తొలివారం టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా క్రికెట్​లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఇంగ్లీష్​లో మాట్లాడేందుకు తాను అనేక ఇబ్బందులు పడినట్లు చెప్పాడు.

Speaking English was mentally challenging in early stages of my career: Virender Sehwag
వీరేంద్ర సెహ్వాగ్​కు పెద్ద ఛాలెంజ్​ అదే!
author img

By

Published : Sep 5, 2021, 7:01 AM IST

టీమ్ఇండియా తరఫున ఆడిన తొలినాళ్లలో తనకు అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని వెల్లడించాడు మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)​. కెరీర్​ ప్రారంభంలో ఇంగ్లీష్​ మాట్లాడేందుకు ఎంతగానో కష్టాలు పడినట్లు చెప్పాడు. తన తొలి ఇంటర్వ్యూను హిందీలోనే చేయమని రవిశాస్త్రిని అప్పట్లో అభ్యర్థించినట్లు వెల్లడించాడు. కానీ, నజఫ్​గఢ్​ నవాబ్​ మాత్రం ఇంగ్లీష్​ ఇంటర్వ్యూ నుంచి తప్పించుకోలేకపోయాడని పేర్కొన్నాడు.

అయితే ఆ తర్వాతి కాలంలో సెహ్వాగ్(Virender Sehwag) ​ ఇంగ్లీష్​ నేర్చుకొని.. ఆట గురించి మీడియాతో మాట్లాడడమే కాకుండా ఇంగ్లీష్​లో కామెంటేటర్​గానూ వ్యవహరించాడు. కానీ, అతడు హిందీ మాట్లాడడం ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు పలుమార్లు వెల్లడించాడు. సెహ్వాగ్​ చేసే ట్వీట్లు అత్యధికంగా హిందీలోనే ఉంటాయి. తనకు ఇంగ్లీష్​ రాదనే విషయాన్ని బహిరంగంగా వెల్లడించేందుకు సెహ్వగ్​ ఏ మాత్రం వెనుకాడడు.

సెహ్వాగ్​ ప్రస్తుతం యూకే వేదికగా జరుగుతున్న భారత్​, ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​ కోసం హిందీ కామెంటేటర్​గా పనిచేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన తర్వాత.. ఈ వృత్తిలో సెటిల్​ అయ్యాడు.

ఇదీ చూడండి.. శతకంతో రోహిత్​ జోరు- టెస్టుల్లో​ అరుదైన ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.