IND VS SA: టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విదేశాల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు బుమ్రా 105 వికెట్లు తీస్తే అందుల్లో 101 వికెట్లు విదేశాల్లో విదేశాల్లో తీసినవే కావడం విశేషం.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు నాలుగో రోజు ఈ మార్క్‌ను అందుకున్నాడు. వాన్ డర్సెన్ వికెట్ తీసి ఈ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట మిగిలి ఉండగా, విజయానికి ఆరు వికెట్ల దూరంలో భారత్ ఉంది. 2018లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటివరకు 25 టెస్టులు ఆడాడు.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా జరుగుతుంది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 327, రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 197 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో చేసింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 94/4 పరుగులతో నిలిచింది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గర్(52 నాటౌట్) ఉన్నాడు.
ఇది చదవండి: IND VS SA: విజయానికి ఆరు వికెట్లు దూరంలో టీమ్ఇండియా