ETV Bharat / sports

Ganguly VS Kohli: కోహ్లీ వివాదంపై గంగూలీ ఏమన్నాడంటే? - కెప్టెన్సీపై కోహ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు

Sourav Ganguly VS Virat Kohli: టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నిరాకరించాడు. ఈ విషయాన్ని క్రికెట్​ బీసీసీఐ డీల్​ చేస్తుందని స్పష్టం చేశాడు.

kohli bcci news
కోహ్లీ
author img

By

Published : Dec 16, 2021, 5:59 PM IST

Sourav Ganguly VS Virat Kohli: దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు నిర్వహించిన ప్రెస్​ కాన్ఫరెన్స్​లో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నిరాకరించాడు. ఈ విషయాన్ని క్రికెట్​ బోర్డ్ పరిష్కరిస్తుందని చెప్పాడు.

ఇదీ జరిగింది..

దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టు ఎంపిక చేసినప్పుడు బీసీసీఐ కోహ్లీకి షాకిచ్చింది. విరాట్​ను వన్డే సారథిగా తప్పిస్తూ రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపింది.

గంగూలీ ఏమన్నాడు..?

Bcci On Virat Kohli Captaincy: కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించిన తర్వాత వివాదం చెలరేగడం వల్ల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని చెప్పినప్పుడు తాము వారించామని అన్నాడు. అయినా, విరాట్‌ తన నిర్ణయానికే కట్టుబడ్డాడని చెప్పాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసే ముందు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు సారథులు ఉండకూడదని సెలక్షన్‌ కమిటీ భావించిందని దాంతో ఆ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. ఈ విషయాన్ని కోహ్లీకి ముందే వెల్లడించినట్లు గంగూలీ పేర్కొన్నాడు.

Sourav Ganguly
గంగూలీ

Virat Kohli Press Conference:

అయితే, గంగూలీ చెప్పిన మాటలకు కోహ్లీ చెప్పిన మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసం ఈ నెల 8న జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు మాత్రమే సెలక్టర్లు తనతో మాట్లాడారని తెలిపాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసినప్పుడు కాల్‌ ముగియడానికి ముందు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారని చెప్పాడు. దీంతో కోహ్లీ, బీసీసీఐ మధ్య విభేదాలు తలెత్తాయని స్పష్టంగా అర్థమవుతోంది.

kohli bcci news
కోహ్లీ

ఇదీ చదవండి: Kohli BCCI: వన్డే కెప్టెన్సీ వివాదం.. సునీల్‌ గావస్కర్‌ ఏమన్నాడంటే.?

Virat Kohli BCCI News: తప్పు ఎవరిదైనా.. ముగింపు పలకాలిక..!

'డర్టీ పాలిటిక్స్'.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.