ETV Bharat / sports

ఆ కీలక పదవి కోసం గంగూలీ వర్సెస్​ జై షా? - గంగూలీ బంగాల్​

Sourav Ganguly vs Jay Shah: ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్​ గ్రెగ్​ బార్క్​లే పదవీకాలం త్వరలో ముగియనుంది. అయితే.. ఈ పదవిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా పోటీపడనున్నట్లు సమాచారం.

Sourav Ganguly vs Jay Shah battle for ICC Chairman post

author img

By

Published : Apr 7, 2022, 6:55 AM IST

Sourav Ganguly vs Jay Shah: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షాలు ఇద్దరూ ఐసీసీ ఛైర్మన్‌ పదవిపై కన్నేసినట్లు సమాచారం. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే పదవీకాలం త్వరలో ముగియనుంది. పదవీకాలాన్ని పొడిగించుకోరాదని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో 2023 ప్రపంచకప్‌ జరిగే సమయంలో భారతీయుడే ఐసీసీ ఛైర్మన్‌గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో బీసీసీఐ ఉన్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో గంగూలీ, షా ఆ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది.

నిబంధనల ప్రకారం ఐసీసీ ఛైర్మన్‌ పదవీకాలం రెండేళ్లు. ఓ ఛైర్మన్‌ గరిష్ఠంగా ఆరేళ్లు పదవిలో ఉండొచ్చు. పేరున్న న్యాయవాది అయిన బార్క్‌లే తీరిక లేని కారణంగా మరోసారి పోటీలో ఉండడానికి సిద్ధంగా లేడని సమాచారం. కొన్నేళ్ల నుంచి కలిసి బీసీసీఐని నడిపిస్తున్న గంగూలీ, షా.. ఒకే పదవికి వేర్వేరుగా పోటీ పడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి వీళ్లిద్దరిలో ఎవరిని ఆ పదవి వరిస్తుందో చూడాలి.

ఇవీ చూడండి: కోహ్లీపై పాక్​ ఫ్యాన్​ కామెంట్​.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఇండియన్​!

'అలాంటి షాట్లు ఆడితే.. పిచ్చోడిలా చూసేవారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.