ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్(steve smith captain again) మరోసారి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల టిమ్ పైన్.. సుదీర్ఘ ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఓ రిపోర్టును సిద్ధం చేసింది ఆసీస్ క్రికెట్ బోర్డు. ఈ బాధ్యతలు స్వీకరించేందుకు స్మిత్ కూడా రేసులో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
"ఆసీస్ టెస్టు కెప్టెన్సీ రేసులో చాలామంది ఉన్నారు. అందులో స్మిత్(steve smith captain again) కూడా ఒకరు. సెలెక్టర్లు కూడా స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు."
-ఆసీస్ క్రికెట్ బోర్డు అధికారి
ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు పేసర్ ప్యాట్ కమిన్స్. దీంతో ఇతడికే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇతడికి సహకరించేందుకు స్మిత్(steve smith captain again)ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి.
పైన్ రాజీనామా
ఓ మహిళతో అసభ్యకర చాటింగ్ చేశాడంటూ ఇటీవల టిమ్ పైన్(tim paine chat)పై ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనంటూ ఒప్పుకొంటూ తన టెస్టు కెప్టెన్సీకి రాజీనామా ప్రకటించాడు పైన్. త్వరలో ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ ఉన్న నేపథ్యంలో ఇతడు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.