క్రికెట్లో.. ఫోర్లు, సిక్స్‌లతో బ్యాటర్ల ధనాధన్ ఇన్నింగ్స్, బౌలర్ల మ్యాజిక్ బౌలింగ్, సూపర్ క్యాచ్‌లతో ఫీల్డర్ల విన్యాసాలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటివే రెండు మ్యాచుల్లో నమోదయ్యాయి. ఓ భారీ సిక్సర్, కళ్లు చెదిరే సూపర్ క్యాచ్ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అది చూసిన క్రికెట్ అభిమానులను ప్లేయర్లను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
major league cricket 2023 : భారీ సిక్సర్... మేజర్ లీగ్ క్రికెట్ - 2023లో ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్ - టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 6 పరుగుల తేడాతో పరాజయం అందుకుంది. 163 లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 39 బంతుల్లో 76 పరుగులు చేసినప్పటికీ వృథా అయిపోయింది. కెప్టెన్ డుప్లెసిస్, డెవాన్ కాన్వే సహా మిగతా వారు ఫెయిల్ అయ్యారు. ఓ దశలో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సూపర్ కింగ్స్‌ను.. క్రీజులోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్ది బౌలర్లకు చెమటలు పట్టించాడు బ్రావో. 5 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. 20 పరుగులు చేశాడు. కానీ ఆరు పరుగులు చేయలేకపోవడం వల్ల జట్టు ఓడిపోయింది.
dj bravo six : అయితే తన ఇన్నింగ్స్‌లో బ్రావో.. ఓ భారీ సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో.. ఏకంగా 103 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. నోర్జే షార్ట్‌పిచ్ డెలివరీ సంధించగా.. బ్రావో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. ఆ బంతి కాస్త స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతోంది.
-
Dwayne Bravo hits a 106 meter six in MLC!#MajorLeagueCricket pic.twitter.com/QJXjSoPDbb
— Abdullah Neaz (@Abdullah__Neaz) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dwayne Bravo hits a 106 meter six in MLC!#MajorLeagueCricket pic.twitter.com/QJXjSoPDbb
— Abdullah Neaz (@Abdullah__Neaz) July 17, 2023Dwayne Bravo hits a 106 meter six in MLC!#MajorLeagueCricket pic.twitter.com/QJXjSoPDbb
— Abdullah Neaz (@Abdullah__Neaz) July 17, 2023
Imam ul haq catch : సూపర్ క్యాచ్.. ఇక పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో కళ్లు చెదిరే క్యాచ్ నమోదైంది. పాక్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హాక్ ఈ క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతడు.. గాల్లోకి ఎగిరి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ తన చేతిలోకి అందుకున్నాడు. అఘా సల్మాన్ బౌలింగ్‌లో సమరవిక్రమ బంతిని బాదగా.. ఇమామ్ ఈ సూపర్ క్యాచ్ పట్టాడు. ఇమామ్ ఫీట్‌కు ఫిదా అయిపోయిన క్రికెట్ అభిమానులు అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. వాటే క్యాచ్ అంటూ లైక్స్ కొడుతూ తెగ కామెంట్లు పెడుతున్నారు.
Pakisthan Srilanka match : ఇక ఇమామ్ క్యాచ్ అందుకోగానే అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. మ్యాచ్‌ను పలుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మొదటి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే నిర్వహించడానికి సాధ్యమైంది. ఆట పూర్తయ్యే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 242 రనస్ చేసింది. ధనంజయ డిసిల్వ 94 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి పాకిస్థాన్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్ (64) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) ఫెయిల్ అయ్యారు. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) పర్వేలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీయగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ చెరో వికెట్ తీశారు.
-
Imam ul Haq with a superb catch@ImamUlHaq12#PakistanCricket #PAKvSL #CricketTwitter pic.twitter.com/gXtjHezRF4
— Hamza Siddiqui (@HamzaSiddiqui56) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Imam ul Haq with a superb catch@ImamUlHaq12#PakistanCricket #PAKvSL #CricketTwitter pic.twitter.com/gXtjHezRF4
— Hamza Siddiqui (@HamzaSiddiqui56) July 16, 2023Imam ul Haq with a superb catch@ImamUlHaq12#PakistanCricket #PAKvSL #CricketTwitter pic.twitter.com/gXtjHezRF4
— Hamza Siddiqui (@HamzaSiddiqui56) July 16, 2023
ఇదీ చూడండి :