ETV Bharat / sports

Shubman Gill ODI Ranking : గిల్​ను ఊరిస్తున్న నెం.1 పొజిషన్.. ఆసీస్ సిరీస్​తో సాధ్యమయ్యేనా! - Shubman Gill Asia Cup 2023

Shubman Gill ODI Ranking : గత కొంతకాలంగా కెరీర్​లో అదరగొడుతున్న శుభ్​​మన్ గిల్.. ప్రస్తుతం వన్డేల్లో నెం.2 ర్యాంక్​లో కొనసాగుతున్నాడు. అయితే వరల్డ్ కప్​ కంటే ముందే గిల్ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాన్ని అందుకునే అవకాశం ఉంది. అదెలాగో తెలుసుకుందాం.

Shubman Gill ODI Ranking
Shubman Gill ODI Ranking
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 8:29 PM IST

Updated : Sep 20, 2023, 9:48 PM IST

Shubman Gill ODI Ranking : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ 24 ఏళ్ల శుభ్​మన్​ గిల్.. కొంతకాలంగా కెరీర్​లో బెస్ట్ పెర్ఫార్మెన్స్​ చేస్తున్నాడు. ఫలితంగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో ప్రపంచంలోని మేటి బ్యాటర్లను సైతం వెనక్కినెట్టి.. 814 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ లిస్ట్​లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 857 రేటింగ్ పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే 2023 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే.. వన్డే ర్యాంకింగ్స్​లో గిల్ కెరీర్​ బెస్ట్ (ఫస్ట్ ప్లేస్) అందుకోడానికి ఛాన్స్ ఉంది. అదెలాగంటే

Australia Tour Of India 2023 : సెప్టెంబర్ 22 నుంచి భారత్.. ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్​ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్​ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆ సిరీస్​కు యంగ్ డైనమిక్ బ్యాటర్ గిల్​ కూడా ఎంపికయ్యాడు. గిల్​ ప్రస్తుత ఫామ్ చూస్తే.. అతడు ఎలాగైనా మూడు మ్యాచ్​ల్లో తుది జట్టులో ఉండడం ఖాయం. అయితే ఆతడు ఈ మూడు మ్యాచ్​ల్లో ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని.. 200 పైచిలుకు పరుగులు సాధిస్తే, బాబర్ అజామ్​​ను వెనక్కి నెట్టి వన్డేల్లో నెం.1 ర్యాంక్ దక్కించుకోగలడు.

Shubman Gill Asia Cup 2023 : ఇటీవల ముగిసిన 2023 ఆసియా కప్ టోర్నమెంట్​​లో శుభ్​మన్ గిల్.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 6 మ్యాచ్​ల్లో కలిపి 75.50 సగటున 302 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్​లో నిలిచాడు. అందులో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Shubman Gill ODI Stats : 2019లో వన్డే అరంగేట్రం చేసిన శుభ్​మన్ గిల్.. ఇప్పటివరకు 33 మ్యాచ్​లు ఆడాడు. అందులో గిల్​ 64.41 సగటున 102.05 స్ట్రైక్ రేట్​తో 1739 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా.. 5 శతకాలు, 8 అర్ధ శతకాలు ఉన్నాయి.

  • Top of the world 🔝

    India's ace pacer reigns supreme atop the @MRFWorldwide ICC Men's ODI Bowler Rankings 😲

    — ICC (@ICC) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ICC ODI Ranking 2023 : ఐసీసీ ర్యాంకింగ్స్​లో రాకెట్​లా దూసుకెళ్లిన సిరాజ్.. ఒక్క మ్యాచ్​తోనే లెక్కలు మార్చేశాడు

ICC World Cup Anthem 2023 : వరల్డ్​ కప్​ యాంథమ్​ వచ్చేసిందోచ్​.. ఇక అందరూ అంటారు 'దిల్ జషన్ బోలే'

Last Updated : Sep 20, 2023, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.