Shubman Gill Captain : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రమోషన్ సాధించాడు. 2024 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ముంబయికి ట్రేడవడం వల్ల గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్లో ప్రకటించింది.
-
𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐆𝐈𝐋𝐋 🫡#AavaDe pic.twitter.com/tCizo2Wt2b
— Gujarat Titans (@gujarat_titans) November 27, 2023
"రానున్న ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపించేందుకు శుభ్‌మన్ గిల్ రెడీ. ఈ కొత్త జర్నీ స్టార్ట్ చేయనున్న గిల్‌కు శుభాకాంక్షలు" అని ట్విట్టర్లో పేర్కొంది. కెప్టెన్‌గా ప్రకటన అనంతరం గిల్.. " గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అవ్వడం గర్వంగా ఉంది. నాపై నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. రెండు సీజన్లు ఆడిన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తా" అని అన్నాడు.
Shubman Gill IPL Stats : గిల్ తన ఐపీఎల్ కెరీర్లో 33 ఇన్నింగ్స్‌ల్లోనే 1373 పరుగులు 47.34 చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత సీజన్లోనే 17 మ్యాచ్‌ల్లో గిల్ 890 పరుగులు బాది.. టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ప్లేఆఫ్స్‌లో ముంబయి ఇండియన్స్‌పై గిల్.. 60 బంతుల్లో 129 పరుగులు బాది గుజరాత్ గెలుపులో కీలకంగా మారాడు.
Ipl 2024 Trade Window Hardik Pandya : అయితే ఇప్పటివరకు గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య నాటకీయ పరిణామాల మధ్య తన ముంబయి ఇండియన్స్ జట్టులోకి వెళ్లాడు. దీంతో శుభ్‌మన్‌ను కెప్టెన్సీ వరించింది. ఆదివారం గుజరాత్ టైటన్స్ జట్టు తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యను.. అట్టిపెట్టుకున్నట్లు ప్రకటించింది. కానీ, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే సంచలనం హార్దిక్ గుజరాత్‌ను వదిలి ముంబయిలో చేరనున్నట్లు సమాచారం అందింది. 2022 ఐపీఎల్లో గుజరాత్‌ను ఛాంపియన్‌గా, 2023లో రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్ హార్దిక్.. రానున్న సీజన్లో ముంబయి ఇండియన్స్‌కు ఆడనున్నాడు. అయితే హార్దిక్‌ను జట్టులోకి తీసుకున్న ముంబయి.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను బెంగళూరుకు ఇచ్చేసింది.
గుజరాత్‌కు ఇక సెలవు - ముంబయి గూటికి హార్దిక్ - డీల్ ఎలా కుదిరిందంటే?
అందరూ వాళ్ల గురించే మాట్లాడతారు - కానీ రైనాను మర్చిపోకూడదు : అశ్విన్