Team india covid: వెస్టిండీస్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియాలో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. వీరిలో నలుగురు ప్లేయర్లు ఉన్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనికి పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొంది. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సహా మరో ఇద్దరు సహాయక సిబ్బంది వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 6న జరగబోయే తొలి వన్డే.. భారత క్రికెట్లో ఎంతో ప్రత్యేకమైనది. అది టీమ్ఇండియా ఆడబోయే 1000వ వన్డే మ్యాచ్. దీంతో ఆ ఘనత సాధించే తొలి జట్టుగా నిలవనుంది భారత్.
వెస్టిండీస్‌తో టీమ్ఇండియా ఆడబోయే వన్డేలు ఫిబ్రవరి 6, 9, 11న అహ్మదాబాద్‌లో.. టీ20లు ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలో జరుగుతాయి.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్, ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్, దీపక్ హుడా, పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్
భారత టీ20 జట్టు: రోహిత్, రాహుల్, కిషన్, కోహ్లి, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్, దీపక్ చాహర్, శార్దూల్, బిష్ణోయ్, అక్షర్ పటేల్, చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్, అవేష్, హర్షల్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: