ETV Bharat / sports

ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా శ్రేయస్​ అయ్యర్​ - shreyas iyer record

Shreyas Iyer: టీమ్​ఇండియా రైజింగ్​ స్టార్​ శ్రేయస్​ అయ్యర్..​ మరో ఘనత దక్కించుకున్నాడు. వెస్టిండీస్​, శ్రీలంక సిరీస్​ల్లో అద్భుత ప్రదర్శనతో ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​​'గా నిలిచాడు.

ICC Player of the Month
Shreyas Iyer
author img

By

Published : Mar 14, 2022, 4:53 PM IST

Updated : Mar 14, 2022, 5:25 PM IST

Shreyas Iyer: క్రికెట్​లో అత్యంత వేగంగా ఎదుగుతోన్న టీమ్ఇండియా బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​.. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా ఎంపికయ్యాడు. స్వదేశంలో గత నెల వెస్టిండీస్​పై, ప్రస్తుతం శ్రీలంకపై అదిరిపోయే ప్రదర్శనతో ఈ ఘనత దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో న్యూజిలాండ్​ ఆల్​రౌండర్​ అమెలియా కెర్​ను ఈ అవార్డు వరించింది.

ICC Player of the Month
శ్రేయస్​-అమెలియా కెర్

వెస్టిండీస్​తో మూడో వన్డేలో మ్యాచ్​ విన్నింగ్​ ప్రదర్శన (80 పరుగులు) సహా మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో ఆఖరి మ్యాచ్​లో 16 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు అయ్యర్​. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్​లో మూడు మ్యూచ్​ల్లోనూ 57, 74, 73 పరుగులతో నాటౌట్​గా నిలిచి.. ప్లేయర్​ ఆఫ్ ది సిరీస్​గా ఎంపికయ్యాడు.

లంకతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్​లోనూ అదరగొడుతున్నారు అయ్యర్​. రెండో టెస్టులో (92, 67) రెండు అర్ధశతకాలతో రాణించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి టీమ్​ఇండియా క్రికెటర్​గా రికార్డు నెలకొల్పాడు.

ఇదీ చూడండి: కోహ్లీ చేసిన పనికి నవ్వులే నవ్వులు.. ఏకంగా మ్యాచ్​ మధ్యలో..

Last Updated : Mar 14, 2022, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.