ETV Bharat / sports

శ్రేయస్​​ అయ్యర్​కు మళ్లీ ఫిట్​నెస్ సమస్య.. మ్యాచ్​కు దూరం! అసలేమైంది? - శ్రేయస్​ అయ్యర్​ గాయం

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతున్న​ సమయంలో టీమ్​ ఇండియాకు ఓ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పితో బాధపడుతున్న క్రికెటర్​ శ్రేయస్​ అయ్యర్​ ఈ మ్యాచ్​కు దూరమయ్యే అవకాశాలున్నాయి.

shreyas iyer
shreyas iyer
author img

By

Published : Mar 12, 2023, 11:57 AM IST

Updated : Mar 12, 2023, 2:58 PM IST

Shreyas Iyer Fitness : ఆస్ట్రేలియాతో కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్​ జరుగుతున్న తరుణంలో టీమ్​ ఇండియాకు ఓ భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని కీలక సభ్యుడైన శ్రేయస్‌ అయ్యర్​కు.. మరోసారి వెన్ను నొప్పి సమస్య తలెత్తింది. ప్రస్తుతం అతను దీని కోసం చికిత్స​ తీసుకునేందుకు వెళ్లాడు. ఫలితంగా అతడు.. మ్యాచ్​లో బ్యాటింగ్​కు రాలేదు. అయ్యర్ ఈ మ్యాచ్​కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది.

గత కొంత కాలంగా అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు శ్రేయస్. మూడో టెస్టు సమయంలోనే తన పరిస్థితి గురించి శ్రేయస్​ సపోర్ట్ స్టాఫ్​కు చెప్పాడు. దీంతో అతడిని తదుపరి చికిత్స​ కోసం స్కానింగ్​కు పంపించింది బీసీసీఐ మెడికల్​ టీమ్​. అయితే సాధారణంగా శ్రేయస్​ అయ్యర్ ఐదో స్థానంలో బ్యాటింగ్​కు దిగుతాడు. కానీ తన పరిస్థితి కారణంగా అతని స్థానంలో మరో ప్లేయర్​ రవీంద్ర జడేజా మైదానంలోకి వచ్చాడు. జడేజా తర్వాతనైనా శ్రేయస్​ వస్తాడనుకుంటే ఆ స్థానంలో శ్రీకర్​ భరత్ ప్రత్యక్షమయ్యాడు. మైదానంలోకి శ్రేయస్​ రాకపోవడం వల్ల ఫ్యాన్స్​ అతని ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ తాజా అప్డేట్ ఇచ్చింది. అయితే శ్రేయస్ ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గాయాల కారణంగా గతంలోనూ పలు మ్యాచ్​లకు శ్రేయస్​ దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్, నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టులో కూడా ఆడలేకపోయాడు. అప్పుడు అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించింది టీమ్​ ఇండియా. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, దిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 బంతులకు 4 పరుగులు చేసి ఔట్ అయిన శ్రేయస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో 10 బంతులకు గాను ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్​ బాట పట్టాడు. ఇక ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు శ్రేయస్. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 26 పరుగులు చేశాడు.

Last Updated : Mar 12, 2023, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.