ETV Bharat / sports

షోయబ్​ ఇన్​స్టా బయోలో బిగ్​ ఛేంజ్​.. సానియాతో విడాకులు నిజమేనా!? - సానియా మీర్జా షోయబ్​ మాలి

Shoaib Malik Sania Mirza Divorce : భారత టెన్నిస్​ దిగ్గజ సానియా మీర్జా దంపతుల విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే.. తమ వివాహ బంధానికి ఫుల్​ స్టాప్​ పెట్టనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మళ్లీ ఏం జరిగిందంటే?

Shoaib Malik Sania Mirza Divorce
Shoaib Malik Sania Mirza Divorce
author img

By

Published : Aug 3, 2023, 10:59 AM IST

Updated : Aug 3, 2023, 11:10 AM IST

Shoaib Malik Sania Mirza Divorce : పాకిస్థాన్​ స్టార్‌ క్రికెటర్‌ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా విడాకుల ఆంశం​ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మార్పు చేయడమే ఇందుకు కారణం.

షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఇదివరకు 'సూపర్ ఉమెన్ సానియా మీర్జా' అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని బయో నుంచి తొలగించి.. తన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచాడు. బయోలో ఇతర వివరాలతో పాటు "ఓ​ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ" మాలిక్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మాలిక్‌, సానియా విడాకులు తీసుకోవడం ఖాయమని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

గతంలో కూడా..
Sania Mirza Divorce : కాగా.. కొన్ని నెలల క్రితం కూడా సానియా, షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనీ, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు తెగ షికార్లు చేశాయి. పాకిస్థాన్​ నటి అయేషా ఉమర్‌తో మాలిక్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలను అయేషా కొట్టిపారేసింది. అవన్నీ రూమర్లే అని ఆమె సృష్టం చేసింది. అయితే ఇదే సమయంలో సానియా, షోయబ్‌ల కొత్త టాక్ షో 'ది మీర్జా మాలిక్ షో' రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది. అయితే తాజాగా మాలిక్ చర్యతో మళ్లీ వారి విడాకుల వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు సానియా, షోయబ్‌ ఎవరూ స్పందించలేదు. కాగా సానియా, షోయబ్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఇజహాన్‌ జన్మించాడు.

Sania Mirza Farwell Match : కొద్దినెలల క్రితం ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మార్చి 5 జరిగిన ఫేర్‌వెల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పాల్గొంది. సింగిల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్నతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సానియా.. తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా సానియా కొడుకు అమ్మ గ్రేట్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో స్టేడియం మొత్తం హర్షద్వానాలు మార్మోగింది. సానియా క్రీడాకారిణిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రాంతంలోనే తిరిగి ముగించింది.

Last Updated : Aug 3, 2023, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.