ETV Bharat / sports

సానియాతో విడాకులు!.. షోయబ్‌ ఏమన్నాడంటే? - షోయబ్‌ మాలిక్ విడాకుల వార్తలు

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా వీటిపై షోయబ్‌ మాలిక్ స్పందించాడు. ఏమన్నాడంటే?

shoaib malik
సానియా మీర్జా
author img

By

Published : Dec 10, 2022, 8:42 PM IST

Updated : Dec 10, 2022, 8:47 PM IST

Shoaib Sania Mirza Divorce : భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులగా వార్తలు గుప్పుమంటున్నాయి. న్యాయపరమైన చిక్కులు అడ్డంకిగా మారాయని, అవి తొలగిన తర్వాత అధికారికంగా ప్రకటన చేస్తారని సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది.

ఈ నేపథ్యంలో షోయబ్‌ మాలిక్‌ స్పందించాడు. ఓ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడుతూ..విడాకుల అంశం తమ వ్యక్తిగతమని అన్నాడు. దీనిని ఇక్కడితో వదిలేయాలని కోరాడు. ఈ అంశంపై ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. విడాకులపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు సానియా మీర్జా కూడా ఎలాంటి సమాధానం చెప్పబోదని పేర్కొన్నాడు.

మరోవైపు వీరిద్దరి మధ్య విడాకుల అంశం ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. వివిధ షోలు, కార్యక్రమాల కోసం ఇప్పటికే కొన్ని ఒప్పందాలు చేసుకోవడంతోపాటు, న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ జంట సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ తొలగిన తర్వాత 12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ వీరిద్దరూ ప్రకటిస్తారని సమాచారం. విడిపోయిన తర్వాత తనయుడు ఐజాన్‌ సంరక్షణ బాధ్యతలను ఇద్దరూ చూసుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Last Updated : Dec 10, 2022, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.