Shivam Dube T20 World Cup : అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా అత్యద్భుతమమైన ఫామ్‌తో దూసుకెళ్లింది. ముఖ్యంగా యంగ్ ప్లేయర్ శివమ్ దూబే (63*) తన బ్యాటింగ్ తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. అన్ని రకాల షాట్లు ఆడి అందరినీ అబ్బురపరిచాడు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ యువ సెన్సేషన్‌పై పడింది. ఇప్పటికే గాయల కారణంగా పలుపురు ప్లేయర్లు టీమ్ఇండియాకు దూరమయ్యారు. గత వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో రానున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పుడున్న జట్టులోకి యంగ్ ప్లేయర్లను తీసుకునేందుకు బీసీసీఐ సుముఖత చూపిస్తోంది. ఈ నేపథ్యంలో దుబె పెర్ఫామెన్స్ చూసిన క్రికెట్ లవర్స్, విశ్లేషకులు టీమ్‌ఇండియా వెతుకుతున్న ఆల్‌రౌండర్ దొరికాడా? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు శివమ్ కెరీర్ జర్నీని ఓ లుక్కేస్తే
అంతర్జాతీయ క్రికెట్లో శివమ్ అరంగేట్రం చేసి నాలుగేళ్లు గడిచిపోయాయి. కానీ హార్దిక్ రూపంలో ఉత్తమ ఆల్‌రౌండర్ జట్టులో ఉండటం వల్ల శివమ్‌కు తగినన్ని అవకాశాలు రాలేవనే చెప్పాలి. ఆడిన ప్రతి మ్యాచ్‌ల్లోనూ దూబె ఫామ్ మెరుగ్గానే ఉంది. 2019లోనే భారత జట్టులోకి వచ్చిన ఈ యంగ్ ప్లేయర్ ఇప్పటి వరకు 20 టీ20ల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 275 పరుగులు స్కోర్ చేశాడు. అతని సగటు 45.83 ఉండటం విశేషం. పేస్ బౌలింగ్‌తో 8 వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ సెన్సేషన్.
-
Up, Up and Away!
— BCCI (@BCCI) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Three consecutive monstrous SIXES from Shivam Dube 🔥 🔥🔥#INDvAFG @IDFCFIRSTBank pic.twitter.com/3y40S3ctUW
">Up, Up and Away!
— BCCI (@BCCI) January 14, 2024
Three consecutive monstrous SIXES from Shivam Dube 🔥 🔥🔥#INDvAFG @IDFCFIRSTBank pic.twitter.com/3y40S3ctUWUp, Up and Away!
— BCCI (@BCCI) January 14, 2024
Three consecutive monstrous SIXES from Shivam Dube 🔥 🔥🔥#INDvAFG @IDFCFIRSTBank pic.twitter.com/3y40S3ctUW
మరోవైపు ఇప్పటివరకు ఆడిన ఏకైక వన్డేలో 9 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్లలోనూ శివమ్ ఆట తీరు మెరుగ్గానే ఉంది. అతను మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరుగున్న సిరీస్‌లో అయితే మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. గాయంతో హార్దిక్ దూరం కావడం వల్ల ఈ అవకాశాన్ని అతడు రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు చేసి భారత్ సిరీస్ సొంతం చేసుకోవడంలో తనవంతు సహాకారాన్ని అందించాడు. వికెట్ కోల్పోకూడదనే పట్టుదలతో సాగుతున్న అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను కూడా ముగించాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయడం, వికెట్లు పడగొట్టడం, బ్యాటింగ్‌లో ధనాధన్ షాట్లతో చెలరేగడం ఇలా జట్టు కోరుకుంటున్న ఆల్‌రౌండర్‌కు ఉండాల్సిన నైపుణ్యాలన్నీ ఇప్పుడు దూబెలో కనిపిస్తున్నాయంటూ మాజీల మాట.
ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో అదరగొడుతున్నప్పటికీ టీ20 ప్రపంచకప్ జట్టులో దూబెకు చోటు ఖాయమని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గాయం నుంచి కోలుకుని హార్దిక్ మళ్లీ జట్టోలోకి వస్తే అప్పుడు దూబెను దూరం పెట్టే అవకాశాలున్నాయి. దీంతో సెలక్టర్ల దృష్టిలో పడాలంటే అతడికి ఐపీఎల్ చాలా కీలకం. 2019 ఐపీఎల్‌కు వేలానికి ముందు బరోడాతో రంజీ మ్యాచ్‌లో ముంబయి తరపున అయిదు బంతులకు అయిదు సిక్సర్లు బాదడం వల్ల దూబె వెలుగులోకి వచ్చాడు. దీంతో వేలంలో రూ.5 కోట్లకు అతణ్ని ఆర్సీబీ జట్టు సొంతం చేసుకుంది. 2019, 2020 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన అతను ఆ తర్వాత రాజస్థాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022 మెగా వేలంలో రూ.4 కోట్లకు అతడ్ని చెన్నై జట్టు దక్కించుకుంది. ఇక ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 418 పరుగులతో సత్తాచాటాడు. దీంతో రానున్నా సీజన్లోనూ బ్యాట్‌తో, బంతితోనూ సత్తాచాటితే దూబె కచ్చితంగా ప్రపంచకప్‌కు వెళ్లే జట్టుతో అవకాశాలు దక్కుతాయని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.