ETV Bharat / sports

లక్ష మంది అభిమానుల మధ్య ఎంసీజీలో వార్న్​ అంత్యక్రియలు

author img

By

Published : Mar 7, 2022, 4:12 PM IST

Shane Warne: స్పిన్​ మాంత్రికుడు షేన్​ వార్న్​ అంత్యక్రియలు మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో అధికారిక లాంఛనాలతో జరపనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్షకుపైగా అభిమానులు హాజరుకానున్నారు.

shane warne last funreals
షేన్​ వార్న్​ అంత్యక్రియలు

Shane Warne: ఆస్ట్రేలియా స్పిన్​ దిగ్గజం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. ఈ అంతిమ సంస్కారాలకు దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు హాజరుకానున్నట్లు తెలిసింది.

ధాయ్​లాండ్​లోని షేన్​ వార్న్​ భౌతికకాయాన్ని ఆస్ట్రేలియాకు తీసుకురానున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, అభిమానులు మెల్​బోర్న్​లో సమావేశం కానున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ నెలాఖరున సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారని, వాటి ప్రణాళికలు ఖరారు అవుతున్నట్లు పేర్కొంది.

ఆస్ట్రేలియా ఫుట్​బాల్​ లీగ్​ ప్రారంభమైన తరుణంలో వార్న్​ అంత్యక్రియలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని మీడియా తెలిపింది. కానీ దిగ్గజ క్రికెటర్​ గౌరవార్థం సర్దుబాట్లు చేయనున్నట్లు పేర్కొంది. అనేక మంది అభిమానులు ఇప్పటికే ఎంసీజీలో షేన్​ వార్న్​ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు, సంతాప లేఖలు, పిజ్జాలు పెట్టి నివాళులు అర్పిస్తున్నారు.​

ఇదీ చదవండి: 14 రోజుల డైట్​ వల్లే వార్న్​ చనిపోయారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.