ETV Bharat / sports

'షనక' వీరబాదుడు.. లంక 'రికార్డ్​' విక్టరీ.. చివరి 3 ఓవర్లలో 59 రన్స్​​ - శ్రీలంక వర్సెస్​ ఆస్ట్రేలియా మూడో టీ20

Aus vs SL captain Shanaka: ఆస్ట్రేలియాతో ఉత్కంఠగా సాగిన మూడో టీ20లో అనూహ్య రీతిలో శ్రీలంక విజయం సాధించింది. ఓటమి ఖాయం అన్న తరుణంలో లంక కెప్టెన్​ డాసన్ షనక ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు విజయాన్ని సాధించాడు.

Shanaka
షనక వీరబాదుడు.
author img

By

Published : Jun 12, 2022, 9:35 AM IST

Aus vs SL captain Shanaka: క్రికెట్​లో విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. అప్పటివరకు గెలుపు సాధిస్తుందనుకున్న జట్టు అనూహ్యంగా ఓటమి పాలవొచ్చు.. ఓడిపోతుందనుకున్న టీమ్​ అద్భుత విజయం అందుకోవచ్చు. అయితే ఇలాంటి సంఘటనే ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్​లో చోటు చేసుకుంది.

షనక వీరబాదుడు.. దసున్​ షనక కెప్టెన్సీలో ఈ ఏడాది ఆడిన 10 మ్యాచుల్లో తొమ్మిది ఓడింది శ్రీలంక. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20ల్లోనూ ఓడి సిరీస్​ కోల్పోయింది. ఇక నామమాత్రంగా ఆడే మూడో టీ20లోనూ 177 పరుగుల చేధనకు బరిలో దిగిన ఆ జట్టు 108 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అప్పటికి ఇంకా 26 బంతుల్లో 69 పరుగులు చేయాలి. దాదాపు ఇది అసాధ్యమే. దీంతో మరో ఓటమి ఖాయం అనుకున్నారంతా. ఆసీస్​ క్లీన్​స్వీప్​ చేస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా గెలుపు తన రూటు మార్చింది. అప్పటివరకు వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొన్న షనక.. అద్భుత ప్రదర్శనతో మ్యాచ్​ను తనవైపు తిప్పుకున్నాడు. దీంతో ఒంటిచేత్తో తమ జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు.

కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు షనక. చమిక కరుణరత్నెతో(14*) కలిసి ఏడో వికెట్​కు అజేయంగా 69 రన్స్​ జోడించాడు. చివరి మూడు ఓవర్లలో 59 పరుగులు అవసరం కాగా.. ఆకాశమే హద్దుగా చెలరేగి 4 సిక్స్​లు, 5 ఫోర్లు ధనాధన్​ బాదాడు. దీంతో అసాధ్యమనుకున్న లక్ష్యం ఓ బంతి మిగిలి ఉండగానే లంక ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేజింగ్​లో ఆఖరి 3 ఓవర్లలో 59 పరుగులు చేయడం, మ్యాచ్​ గెలవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్​లో షనక మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలవగా.. ఆస్ట్రేలియా కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​ మొత్తం 114 చేసి మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్​లో హేజిల్​వుడ్​ అద్భుతంగా బౌలింగ్​ చేశాడు. తన తొలి మూడు ఓవర్లలోనే కేవలం 3 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే తన చివరి ఓవర్లో(18) మాత్రం షనక బ్యాటింగ్ ధాటికి ఏకంగా 22 రన్స్​ సమర్పించుకున్నాడు.

ఇదీ చూడండి: గ్రాండ్​మాస్టర్​గా మరో తెలుగు కుర్రాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.