Shami Ruled Out : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. సౌతాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరం కానున్నాడు. కాలిచీలమండల (Ankle Injury) గాయంతో షమీ తీవ్రంగా బాధపడుతున్నాడు. అయితే టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసినప్పుడే బీసీసీఐ షమీ గాయం గురించి చెప్పింది.'షమీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతడు బరిలోకి దిగడం తన ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది' అని నవంబర్ 30న బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 15) టీమ్ఇండియా టెస్టు జట్టు సౌతాఫ్రికా ప్రయాణం కానుంది. అయితే గాయం కారణంగా షమీ జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లట్లేదు. కాగా, షమీ రిప్లేస్మెంట్ను బీసీసీఐ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.
-
🚨 REPORTS 🚨
— Sportskeeda (@Sportskeeda) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Mohammad Shami is likely to be ruled out of the South Africa Test series.
He is recovering from an ankle injury. #MohammadShami #Cricket #SAvIND #Sportskeeda pic.twitter.com/IxoiRvsoMU
">🚨 REPORTS 🚨
— Sportskeeda (@Sportskeeda) December 14, 2023
Mohammad Shami is likely to be ruled out of the South Africa Test series.
He is recovering from an ankle injury. #MohammadShami #Cricket #SAvIND #Sportskeeda pic.twitter.com/IxoiRvsoMU🚨 REPORTS 🚨
— Sportskeeda (@Sportskeeda) December 14, 2023
Mohammad Shami is likely to be ruled out of the South Africa Test series.
He is recovering from an ankle injury. #MohammadShami #Cricket #SAvIND #Sportskeeda pic.twitter.com/IxoiRvsoMU
కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా శుక్రవారం సౌతాఫ్రికా వెళ్లనుంది. రోహిత్‌పాటు విరాట్ కోహ్లీ, జస్ర్పీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నవ్‌దీప్ సైనీ టీమ్ఇండియా టెస్టు బృందంలో ఉన్నారు. ఇక ప్రస్తుతం టీమ్ఇండియా యువ జట్టు సఫారీ గడ్డపై వెట్ బాల్ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.
ఆతిథ్య జట్టులోనూ గాయాల బెడద : మరోవైపు ఆతిథ్య సౌతాఫ్రికా జట్టును కూడా గాయాలు వెంటాడుతున్నాయి. సఫారీ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా వెన్ననొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. నోకియాతో పాటు లుంగి ఎంగ్డీ, కగిసో రబాడా కూడా గాయాల కారణంగా భారత్‌తో మ్యాచ్‌లు ఆడేది డౌటే.
టెస్టు సిరీస్ షెడ్యూల్
- తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్ మధ్యాహ్నం 1:30
- రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ మధ్యాహ్నం 2:00
భారత్ టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
'భారత్ ఆ సిరీస్ గెలవాలంటే విరాట్ కీలకం- కోహ్లీ ఎక్కడైనా భారీ ఆటగాడే'