టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot singh sidhu news) తన పిల్లల్ని బోర్డర్‌కు పంపాలని మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్(Gautam gambhir on navjot singh sidhu) డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సిద్ధూ తన పెద్దన్నగా సంబోధించిన నేపథ్యంలో గౌతీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"పాక్ అండదండలతో చెలరేగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ 70 ఏళ్లుగా పోరాడుతుంటే.. దానికి సహకరిస్తున్న దేశాధినేతను పట్టుకొని 'పెద్దన్న'గా పేర్కొనడం సిగ్గుచేటు. నీ కుమారుడు లేదా కూతుర్ని బోర్డర్‌కు పంపిన తర్వాతే ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఆ దేశాధినేతను పెద్దన్న(Sidhu imran khan) అని పిలుచుకో. ఇది చాలా దారుణమైన విషయం"
-గౌతమ్ గంభీర్, టీమ్ ఇండియా మాజీ ఓపెనర్
శనివారం ఉదయం సిద్ధూ.. పాకిస్థాన్ భూభాగంలోని కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్‌ఖాన్ చొరవ వల్లే కర్తార్‌పుర్ నడవా తిరిగి తెరుచుకుందని, పంజాబ్ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వాణిజ్య కార్యకలాపాల కోసం రెండు దేశాల సరిహద్దులను తిరిగి తెరవాలని కోరారు. పంజాబ్ నుంచి పాకిస్థాన్‌కు 21 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు ముంద్రా పోర్టు మీదుగా 2,100 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్‌ఖాన్ తనకు పెద్దన్నయ్య లాంటి వారని సంబోధించారు. దీంతో దుమారం రేగుతోంది. భాజపా నేతలు సిద్ధూ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: