ETV Bharat / sports

భారత్​-పాక్​ మ్యాచ్.. సోషల్ మీడియాకు సానియా దూరం - సానియా మీర్జా

టీ20 ప్రపంచకప్​-2021లో భాగంగా భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​(Ind vs Pak T20 World Cup) నేపథ్యంలో దుబాయ్​కి చేరుకుంది భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా(Sania Mirza News). బయోబబుల్​లో ఉన్న తన భర్త, పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్​ను కలిసింది. కాగా, ఈ మ్యాచ్​కు ముందు సోషల్ మీడియాకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపింది సానియా.

shoaib, sania
షోయబ్, సానియా
author img

By

Published : Oct 20, 2021, 4:40 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021)​ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమ్​ఇండియా. అక్టోబర్ 24న ఈ మ్యాచ్​ జరగనుంది. ఈ టోర్నీ కోసం కుటుంబసభ్యులు ఆటగాళ్లను కలిసేందుకు అనుమతించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఈ నేపథ్యంలో టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా(Sania Mirza News) దుబాయ్​కి చేరుకుంది. అక్కడే బయోబబుల్​లో ఉన్న తన భర్త, పాక్​ ఆటగాడు షోయబ్​ మాలిక్​ను కలిసింది.

క్వారంటైన్ పూర్తి చేసుకున్న సానియా.. తన తనయుడిని కూడా బయోబబుల్​లోకి తీసుకెళ్లింది. మాలిక్​తో పాటు ఇతర పాకిస్థాన్ క్రికెటర్లు ఇమాద్ వాసిమ్, ఫకర్ జమాన్, హసన్ అలీ, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ హఫీజ్, ఉస్మాన్ ఖదీర్ కుటుంబ సభ్యులు కూడా దుబాయ్​కి చేరుకున్నారు.

సోషల్ మీడియాకు దూరంగా..

కాగా.. ఆదివారం భారత్, పాకిస్థాన్​ మ్యాచ్(Ind vs Pak T20 World Cup)​ నేపథ్యంలో సోషల్​ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు సానియా ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. అందుకు కారణం కూడా వివరించింది. సోషల్​ మీడియాలో ఆరోజు ఏదైనా పోస్ట్​ చేస్తే విపరీతంగా ట్రోల్స్​ వస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

T20 World Cup: పాక్‌తో అంత ఆషామాషీ కాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.