ETV Bharat / sports

'టీమ్ఇండియా RRR' అంటూ.. వాళ్లపై సచిన్​ పొగడ్తల వర్షం.. - border gavaskar trophy 2023 రవిచంద్రన్ అశ్విన్

బోర్డర్​-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి రోజు బ్యాటు, బంతితో ప్లేయర్లు చెలరేగిపోయారు. దీంతో సచిన్​ తెందుల్కర్​ ఆటగాళ్లపై పొగడ్తల వర్షం కురిపించాడు. రోహిత్, రవీంద్ర, రవిచంద్రన్​ను 'ఆర్​ఆర్​ఆర్​'గా అభివర్ణించాడు. ఇంకా ఏమన్నాడంటే..

sachin tendulkar rrr tweet
sachin tendulkar rrr tweet
author img

By

Published : Feb 10, 2023, 4:10 PM IST

నాగ్​పుర్​ వేదికగా జరుగుతున్న బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ తొలి టెస్టు మొదటి రోజు టీమ్​ఇండియా ప్లేయర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అటు బంతి​, ఇటు బ్యాట్​తో రాణించారు. వీరి ప్రదర్శనపై క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. అందులో ముఖ్యంగా ప్లేయర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మల త్రయాన్ని 'ఆర్​ఆర్​ఆర్​'గా అభివర్ణించాడు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా వారిపై ప్రశంసల జల్లు కురిపించాడు మాస్టర్​ బ్లాస్టర్. "ఆర్ఆర్ఆర్.. రోహిత్, రవీంద్ర, రవిచంద్రన్ త్రయం.. టెస్టులో టీమ్​ఇండియాను ఆధిక్యంలో నిలబెట్టారు. రోహిత్ తన శతకంతో ముందుండి నడిపించాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక వికెట్లు పడగొట్టారు" అని సచిన్ తెందుల్కర్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

కాగా, ఈ మొదటి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ రెచ్చిపోయారు. దాదాపు ఐదు నెలల విరామం తర్వాత ఫస్ట్​ ఇంటర్నేషనల్​ మ్యాచ్ ఆడిన జడ్డూ.. ఐదు వికెట్లు తీసి రాణించాడు. అశ్విన్ మూడు వికెట్ల తీయడం వల్ల.. ఆస్ట్రేలియా 177 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్..​ అద్భుత ప్రదర్శన చేసింది. రోహిత్​ శర్మ కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడి సెంచరీ పూర్తి చేశాడు. ఈ శతక ప్రదర్శనతో మూడు ఫార్మాట్లలోనూ త్రీ డిజిట్​ స్కోరు అందుకున్న తొలి ఇండియన్ కెప్టెన్​గా రికార్డు సృష్టించాడు. ఇక ప్రపంచంలో ఈ ఫీట్​ చేసిన నాలుగో సారథిగా నిలిచాడు.

ఇవీ చదవండి :

స్టైల్​లోనూ తగ్గేదే లే.. క్రికెటర్ల పోనీ టెయిల్​ అదిరిపోలా

IND VS AUS: రెండేళ్ల తర్వాత రోహిత్ సెంచరీ.. నిరాశపరిచిన కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.