ETV Bharat / sports

మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్.. ఇండియా లెజెండ్స్​ టీమ్​కు సారథ్యం - ఇండియా లెజెండ్స్​కు సచిన్​ సారథ్యం

క్రికెట్​ అభిమానులకు శుభవార్త. క్రికెట్​ లెజెండ్ మాస్టర్​ బ్లాస్టర్ సచిన్​ తెందుల్కర్​​ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​ లో భాగంగా భారత్​ లెజెండ్స్​ టీమ్​కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్​ సెప్టెంబర్​ 10న ప్రారంభం కానుంది.

Etv Bharat
Sachin Tendulkar to lead Indian Legends in Road Safety World Series Season 2 of legends league cricket 2022
author img

By

Published : Sep 1, 2022, 10:35 PM IST

Updated : Sep 2, 2022, 7:00 AM IST

Road Safety World Series : రోడ్‌సేఫ్టీ ప్రపంచ సిరీస్‌ సీజన్‌-2 టోర్నమెంట్లో పాల్గొనే ఇండియన్‌ లెజెండ్స్‌ జట్టుకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్‌ 10న ఆరంభమయ్యే ఈ టోర్నమెంట్‌కు కాన్పూర్‌, రాయ్‌పుర్‌, ఇండోర్‌, డెహ్రాడూన్‌ వేదికలుగా నిలువనున్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ కాన్పూర్‌లో జరుగుతుండగా.. రాయ్‌పుర్‌లో సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ జరగనున్నాయి. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌ జట్లకు చెందిన దిగ్గజ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. న్యూజిలాండ్‌ లెజెండ్స్‌ జట్టు ఈసారి కొత్తగా లీగ్‌లో చేరింది. రోడ్డు భద్రతే ప్రధాన ధ్యేయంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు ముందుకు వచ్చి ఇలా సిరీస్‌ ఆడడం వల్ల రోడ్డు భద్రతపై అభిమానుల్లో అవగాహన వస్తుందని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

"క్రికెట్​తో రోడ్​ సేఫ్టీ మీద అవగాహన కల్పించడం అనేది మంచి ఇనీషియేటివ్​. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి రోడ్​ సేఫ్టీ రూల్స్​పై అవగాహన ఉండాలి. వాటిని అనుసరించాలి. అలా జరగాలంటే వారికి అవగాహన కల్పించాలి. భారతీయ రోడ్లపై ప్రాణాలను కాపాడాలనే లక్ష్యం.. ఈ సిరీస్​తో సాధ్యం అవుతుందని నేను నమ్ముతున్నాను" అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

ఇవీ చదవండి: 'టెన్షన్​ ఎందుకు? టైమ్ వస్తే అదే అవుతుంది!'.. 90 మీటర్స్ టార్గెట్​పై నీరజ్​ కూల్ రిప్లై

భారత్​-హాంకాంగ్​ మ్యాచ్​.. స్టేడియంలో క్రికెటర్​ లవ్​ ప్రపోజల్​

Last Updated : Sep 2, 2022, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.