ETV Bharat / sports

అప్పుడు కావాలనే సచిన్​ను గాయపరిచా: అక్తర్ - సచిన్​కు గాయం

​Shoaib akthar inured Sachin: పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓ సందర్భంలో భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ను గాయపరచాలనే ఉద్దేశంతో దూకుడుగా ఆడినట్లు గుర్తుచేసుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు మాస్టర్​ తప్పించుకున్నాడని పేర్కొన్నాడు.

​Shoaib akthar inured Sachin:
సచిన్ అక్తర్​
author img

By

Published : Jun 5, 2022, 11:42 AM IST

​Shoaib akthar inured Sachin: తన బౌన్సర్లతో ఎంతో మంది మేటి ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు పాకిస్థాన్​ స్పీడ్​స్టార్​ షోయబ్​ అక్తర్​. అతడి బౌలింగ్​లో బ్యాటర్లు గాయపడిన సందర్భాలున్నాయి. అయితే భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ మాత్రం అక్తర్​ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. భారీ స్కోర్లను సాధించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్తర్​.. ఓ ఆసక్తికర సంఘటనను తెలిపాడు. 2006లో టీమ్​ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన ఓ మ్యాచ్​ను గుర్తుచేసుకున్న అతడు... ఆ సమయంలోనే తాను మాస్టర్​ను ఓ సారి గాయపరిచినట్లు తెలిపాడు.

"కరాచీ లో మూడో టెస్టు జరిగిన సమయంలో సచిన్​ను గయపరచడమే లక్ష్యంగా బౌలింగ్​ చేశాను. అతడు బ్యాటింగ్​కు దిగగానే లైన్​ అండ్ లెంగ్త్​తో వికెట్ల ముందు బౌలింగ్​ చేయమని కెప్టెన్​ ఇంజమామ్​ నాకు సలహా ఇచ్చాడు. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. అతడిని ఔట్​ చేయాలనే ఉద్దేశంతో ఆడలేదు.. గాయపరచాలనే ఉద్దేశంతోనే దూకుడుగా బౌలింగ్​ చేశాడు. అలా నేను వేసిన ఓ బౌన్సర్​ మాస్టర్​ హెల్మెట్​ను బలంగా తాకింది. ఇక అతడి పని అయిపోయిందని అనుకున్నాను. కానీ అతడు తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరితోనూ చెప్పలేదు. మళ్లీ అతడిని దెబ్బతీద్దామనుకున్నా కానీ కుదరలేదు." అని షోయబ్​ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: దీపక్​ చాహర్​ రిసెప్షన్​.. డ్యాన్స్​లతో క్రికెటర్ల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.