ETV Bharat / sports

'సచిన్​ అంటే భయం లేదు.. సెహ్వాగ్​తోనే..'

క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​కు బౌలింగ్​ చేయడం అంటే తనకు అస్సలు భయం ఉండేది కాదని స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రాతో మాట్లాడిన ఆయన.. సెహ్వాగ్​, లారాపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు.

muralidharan
మురళీధరన్
author img

By

Published : Aug 21, 2021, 5:33 AM IST

శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్.. సచిన్​కు బౌలింగ్​ చేయడం అంటే తనకు అస్సలు భయం ఉండేది కాదని తెలిపాడు. ఓ ఛానల్​లో కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో మాట్లాడిన మురళీధరన్.. సెహ్వాగ్​, లారాకు బౌలింగ్​ చేయడంపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు.

"సచిన్​కు బౌలింగ్​ చేయడం అంటే నాకు భయం లేదు. ఎందుకంటే సెహ్వాగ్​, లారాలా అతను నన్ను ఇబ్బంది పెట్టడు. ఆఫ్​ స్పిన్​లో వికెట్​ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. నా బౌలింగ్​తో సచిన్​ను చాలా సార్లు ఔట్ చేశాను. ఆఫ్​స్పిన్​లో సచిన్​ ఇబ్బందిపడుతుండటం నేను గమనించాను. బహుశా ఇదే సచిన్​ వీక్​నెస్ అనుకుంటా."

--ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక మాజీ క్రికెటర్.

వన్డేల్లో 530 వికెట్లు తీసిన మురళీధరన్, సచిన్​ను 13 సార్లు ఔట్​ చేశాడు. మొత్తంగా మురళీధరన్ 800 టెస్టు వికెట్లు తీసి ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్​గా నిలిచాడు.

ఇక సెహ్వాగ్​, లారాలను ప్రశంసలతో ముంచెత్తాడు మరళీధరన్​. సెహ్వాగ్​ ఓ డేంజరస్​ బ్యాట్స్​మన్ అని అన్నాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ మంచి బ్యాట్స్​మెన్ అని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:'షారుఖ్‌, సల్మాన్‌ సొంత తమ్ముడిలా చూసుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.