Ross Taylor Retirement: న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్‌కు దూరం కానున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో సిరీస్‌ల అనంతరం వన్డే జట్టుకు కూడా దూరం కానున్నట్లు పేర్కొన్నాడు. వచ్చే ఏడాది వేసవి కాలం వరకు అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు టేలర్.
-
Today I'm announcing my retirement from international cricket at the conclusion of the home summer, two more tests against Bangladesh, and six odi’s against Australia & the Netherlands. Thank you for 17 years of incredible support. It’s been an honour to represent my country #234 pic.twitter.com/OTy1rsxkYp
— Ross Taylor (@RossLTaylor) December 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today I'm announcing my retirement from international cricket at the conclusion of the home summer, two more tests against Bangladesh, and six odi’s against Australia & the Netherlands. Thank you for 17 years of incredible support. It’s been an honour to represent my country #234 pic.twitter.com/OTy1rsxkYp
— Ross Taylor (@RossLTaylor) December 29, 2021Today I'm announcing my retirement from international cricket at the conclusion of the home summer, two more tests against Bangladesh, and six odi’s against Australia & the Netherlands. Thank you for 17 years of incredible support. It’s been an honour to represent my country #234 pic.twitter.com/OTy1rsxkYp
— Ross Taylor (@RossLTaylor) December 29, 2021
"17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నా. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడిన తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటా. ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు."
--రాస్ టేలర్, న్యూజిలాండ్ బ్యాటర్.
2006లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు టేలర్. ఇప్పటివరకు 233 వన్డేలు ఆడిన అతడు.. 8576 పరుగులు చేశాడు. ఇతర ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్ తరఫున ప్రత్యేకంగా నిలిచాడు. మొత్తంగా 102 టీ20ల్లో 1909 పరుగులు, 110 టెస్టుల్లో 7585 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: