ETV Bharat / sports

రోహిత్​ భారీ సిక్సర్​.. చిన్నారికి గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ.. - teamindia vs england

Rohith Six injured child: ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో రోహిత్​ శర్మ బాదిన ఓ భారీ సిక్సర్​.. స్టాండ్స్​లో ఉన్న ఓ చిన్నారికి బలంగా తాకింది. దీంతో ఆ పాప నొప్పితో విలవిల్లాడింది. తక్షణమే అక్కడి ఫిజియోలు ఆ పాపకు ప్రాథమిక చికిత్స అందించారు.

Rohiths sharma Hit six to a little girl
రోహిత్​ భారీ సిక్సర్​
author img

By

Published : Jul 13, 2022, 8:56 AM IST

Updated : Jul 13, 2022, 10:42 AM IST

Rohith Six injured child: ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా (6/19) సంచలన బౌలింగ్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (76 నాటౌట్‌; 58 బంతుల్లో 7×4, 5×6) ధనాధన్​ ఇన్నింగ్స్​.. మరో ఓపెనర్‌ ధావన్‌ (31*; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్‌ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

అయితే ఈ క్రమంలోనే రోహిత్​ బాదిన ఓ భారీ సిక్స్​ ఓ చిన్నారిని బాగా బాధించింది. ఐదో ఓవర్​లో డేవిడ్​ విల్లీ వేసిన మూడో బంతిని ఫుల్​ షాట్​ ఆడిన హిట్​మ్యాన్​ బలమైన షాట్​ కొట్టాడు. అది కాస్త స్టాండ్స్​లో ఉన్న ఓ చిన్నారికి బలంగా తాకింది. దాంతో ఆ పాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడింది. ఈ విషయాన్ని బౌండరీ లైన్​ వద్ద ఫీల్డింగ్​ చేస్తున్న బెన్​స్టోక్స్​.. రోహిత్​కు చెప్పాడు. ఇది తెలుసుకున్న హిట్​మ్యాన్​ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో కొద్దిసేపు మ్యాచ్​ను ఆపారు.

తక్షణమే ఇంగ్లాండ్​ ఫిజియోలు ఆ పాప దగ్గరికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం ఎలా ఉందనేది సమాచారం తెలియలేదు. అయితే ట్విట్టర్​లో మాత్రం ఓ నెటిజన్​.. ఆ పాప పేరు మీరా సాల్వి అని, ఆమె ప్రస్తుతం బాగానే ఉందని ఫొటోను పోస్ట్​ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాకు పాక్​ మాజీ కెప్టెన్​ వార్నింగ్​.. అలా చేయొద్దంటూ..

Last Updated : Jul 13, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.