Rohit test captaincy Yuvraj: టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించడంపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ సెలెక్టర్లు ఎమోషనల్‌గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నాడు. రోహిత్‌ను టెస్టు కెప్టెన్‌గా నియమించిన సమయంలోనూ అతడు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడని గుర్తు చేశాడు. అలాంటి ఆటగాడిని టెస్టు సారథిగా నియమించకూడదని అభిప్రాయపడ్డాడు.
Rohit fitness Yuvraj news: 'అది భావోద్వేగపరమైన నిర్ణయమని నా అభిప్రాయం. అతడు ఎక్కువగా గాయాలపాలవుతున్నాడు. ఈ వయసులో శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఆటగాడిని టెస్టు సారథిగా నియమించకూడదు. ఇది అతడి సారథ్యంపైనా ప్రభావం చూపుతుంది. టెస్టు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానంలో ఆడటం ప్రారంభించి రెండేళ్లే అవుతోంది. అతడు బాగా ఆడుతున్నాడు. అతడి దృష్టి బ్యాటింగ్‌పై ఉంచుకోవాలి. కానీ, ఐదు రోజులు గ్రౌండ్లో నిల్చోవడం కష్టం' అని యువీ చెప్పుకొచ్చాడు.
Rohit captaincy records: అయితే, పొట్టి ఫార్మాట్లో రోహిత్ అద్భుతమైన ఆటగాడని యువరాజ్ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి ముందుగానే టీమ్ఇండియా సారథ్యం లభించాల్సిందని అన్నాడు. 'అతడు గొప్ప నాయకుడు. ముంబయి ఇండియన్స్‌లో నేను అతడి సారథ్యంలోనే ఆడా. అతడు బాగా ఆలోచిస్తాడు. మంచి కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు ఎప్పుడో సారథి కావాల్సింది. కానీ విరాట్ కోహ్లీతో పాటు జట్టు కూడా అద్భుతంగా రాణించిన నేపథ్యంలో అది సాకారం కాలేదు' అని యువీ వివరించాడు.
ఈ ఏడాది జరిగిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ అనంతరం టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్‌గా రోహిత్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు కెప్టెన్సీనీ అతడికే అప్పగించింది బీసీసీఐ. అయితే, రోహిత్‌కు అప్పుడు 34 ఏళ్లు. గాయాల వల్ల గత రెండేళ్లలో కీలక సిరీస్‌లకు రోహిత్ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి బదులు మరో ఆటగాడిని టెస్టు సారథిగా ఎంపిక చేయాల్సిందని అప్పుడే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, పొట్టిఫార్మాట్లో తన నాయకత్వ పటిమను రుజువు చేసుకున్న రోహిత్‌కే పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు.
ఇదీ చదవండి: