ETV Bharat / sports

విండీస్ టూర్‌లో రోహిత్‌కు విశ్రాంతి!.. మరి కోహ్లీ సంగతేంటి?

Rohith Sharma West Indies Tour : డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత లభించిన నెల రోజుల బ్రేక్​ను టీమ్​ఇండియా ప్లేయర్లు తమ కుటుంబాలతో ఎంజాయ్​ చేస్తున్నారు. అయితే వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు రోహిత్​ దూరమవ్వనున్నట్లు సమాచారం. ఫామ్​ లేమితో ఇబ్బంది పడుతున్న హిట్​ మ్యాన్​కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనుందట.

Rohith Sharma West Indies Tour
Rohith Sharma West Indies Tour
author img

By

Published : Jun 16, 2023, 5:02 PM IST

Updated : Jun 16, 2023, 5:14 PM IST

Rohith Sharma West Indies Tour : ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ ఫైనల్​ ఓటమి తర్వాత భారత క్రికెట్​ జట్టుకు సుమారు నెల రోజుల గ్యాప్ దొరికింది. ఈ సమయంలో టీమ్​ అంతా విశ్రాంతి తీసుకుంటోంది. అలా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ హిట్‌మ్యాన్‌ షేర్‌ చేశాడు.

India Vs West Indies : ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న భారత జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్‌తో మళ్లీ ఫీల్డ్‌లో అడుగుపెట్టనుంది. విండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత టూర్‌ ప్రారంభం కానుంది.

Rohith Sharma WTC Final :అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ అంత గొప్పగా రాణించలేదు. రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 15, 43 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లో కూడా రోహిత్ పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో జరిగే టెస్టులు లేదంటే ఆ జట్టుతో జరిగే మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో అతనికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

"ఐపీఎల్‌లో ఆ తర్వాత జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ శర్మ అంత జోష్‌గా కనిపించలేదు. అందుకే వెస్టిండీస్ టూర్‌లో కొంత భాగమైనా అతడు విశ్రాంతి తీసుకోవాలని సెలెక్టర్లు అనుకుంటున్నారు. అయితే టెస్టులు ఆడడు. లేదంటే ఆ తర్వాత జరిగే 8 వైట్ బాల్ గేమ్స్ ఆడడు. ఈ విషయంలో రోహిత్‌తో మాట్లాడిన తర్వాతే సెలెక్టర్లు ఒక నిర్ణయానికి వస్తారు" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

Virat Kohli West Indies Tour : అయితే ఇంకా వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడే భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రోహిత్‌తో మాట్లాడిన తర్వాత ఈ జట్లపై ఒక నిర్ణయానికి వస్తారని ఆ తర్వాత జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే రోహిత్‌తోపాటు కోహ్లీకి కూడా విశ్రాంతి ఇస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే అతడు కూడా సీనియరే కదా. అయితే వైట్‌బాల్ ఫార్మాట్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి అతడిని పక్కన పెట్టరనే ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

టీమ్​ఇండియా విండీస్​ పర్యటన వివరాలు..

  • తొలి టెస్ట్‌- జులై 12-16, విండ్సర్ పార్క్‌, డొమినికా
  • రెండో టెస్ట్‌- జులై 20-24, క్వీన్స్ పార్క్ ఓవల్‌, ట్రినిడాడ్‌
  • జులై 27- తొలి వన్డే, కెన్సింగ్​టన్​ ఓవల్​, బార్బడోస్​
  • జులై 29- రెండో వన్డే, కెన్సింగ్​టన్​ ఓవల్​, బార్బడోస్​
  • ఆగస్ట్‌ 1- మూడో వన్డే, బ్రెయిన్ లారా క్రికెట్​ అకాడమీ, ట్రినిడాడ్‌
  • ఆగస్ట్‌ 3- తొలి టీ20, బ్రెయిన్ లారా క్రికెట్​ అకాడమీ, ట్రినిడాడ్‌
  • ఆగస్ట్‌ 6- రెండో టీ20, నేషనల్​ స్డేడియం, గయానా
  • ఆగస్ట్‌ 8- మూడో టీ20, నేషనల్​ స్డేడియం, గయానా
  • ఆగస్ట్‌ 12- నాలుగో టీ20, బ్రౌవార్డ్​ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా
  • ఆగస్ట్‌ 13- ఐదో టీ20, బ్రౌవార్డ్​ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా

Last Updated : Jun 16, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.