Rohit Sharma: టీమ్‌ఇండియాలో యువకులకు అవకాశాలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ప్రతి సిరీస్‌కు ఓ కొత్త ఆటగాడు అరంగేట్రం చేశాడు. కొందరి ఆటగాళ్లకు తుదిజట్టులో అవకాశం వస్తే.. మరికొందరికి రెండు, మూడు సిరీస్‌ల తర్వాత వచ్చింది. అయితే, భారత జట్టు సిరీస్ గెలిచిందంటే చాలు మిగిలిన మ్యాచ్‌లకు రిజర్వ్ బెంచ్ ఆటగాళ్ల అవకాశం ఇస్తున్నారు. దీనిపై తాజా టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడాడు.
"మేము చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నాం. కాబట్టి ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్బాల్లో ఆటలో తీరికలేని కారణంగా విశ్రాంతి అవసరం. ఇలాంటి సమయాల్లో రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటం ముఖ్యం. వారికి ఛాన్స్‌లు ఇస్తూ ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్ల ప్రదర్శన మెరుగవుతుంది. తద్వారా భారత్ క్రికెట్‌ను సురక్షితమైన చేతుల్లో పెట్టవచ్చు. ఈ ప్రణాళికతోనే ఆటగాళ్ల రొటేషన్ జరుగుతుంది. గెలుపోటములు ముఖ్యం కాదు. మేం ఒక జట్టుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తాం. మేమంతా కలిసి రాణిస్తేనే జట్టు విజయానికి తోడ్పడగలం. ఆ దిశగానే పనిచేస్తున్నాం."
-- రోహిత్ శర్మ, టీమ్‌ఇండియా కెప్టెన్
"ద్రవిడ్ సార్ భారత జట్టు కోచ్‌గా వచ్చినప్పుడు, అతనితో జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే దానిపై మాట్లాడాను. అతను నాలాంటి ఆలోచనా విధానంతోనే ఉన్నాడు. దీంతో జట్టును నడిపించడం నాకు సులభమవుతోంది. జట్టు ఒకే దిశలో పయనించడానికి కోచ్, కెప్టెన్‌ల మధ్య ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి. మేం నిర్ణయించుకున్న విషయం ఏమిటంటే.. జట్టులో ఎటువంటి గందరగోళాన్ని సృష్టించకుండా మంచి ఫలితాలను రాబట్టాలి. టీమ్‌ఇండియా ఆడే శైలిని ఫార్మాట్‌కు అనుగుణంగా మార్చాలనుకుంటున్నాం. మూడు ఫార్మాట్లను ఒక నిర్దిష్ట మార్గంలో ఆడాలనుకుంటున్నాం" అని రోహిత్ తెలిపాడు.
ఇవీ చదవండి: ICC Rankings: సూర్య జోరు.. కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్