ETV Bharat / sports

'ఆ విషయం ఇప్పుడు ఎందుకు - రోహిత్ గురించి మాకు క్లారిటీ లేదు' - రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్

Rohit Sharma T20 World Cup 2024 : రానున్న టీ20 ప్రపంచకప్​ తుది జట్టు కూర్పు గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Rohit Sharma T20 World Cup 2024
Rohit Sharma T20 World Cup 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 10:31 AM IST

Rohit Sharma T20 World Cup 2024 : ఇటీవలే జరిగిన వన్డే ప్రపంచకప్​తో టీమ్​ఇండియా హెడ్​ కోచ్​గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు ముగిశాయి. అయితే వచ్చే ఏడాది జూన్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ మరోసారి ద్రవిడ్​కు పగ్గాలు అప్పజెప్పింది. అయితే టీ20 ప్రపంచకప్ వరకు మాత్రమే కాకుండా కోచ్​గా మరికొంతకాలం అతడు ఉండేలా చూసుకోవాలని బీసీసీఐ గట్టి ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని పొడగించనున్నట్లు బీసీసీ సెక్రటరీ జై షా వెల్లడించాడు. అయితే ప్రస్తుతం ద్రవిడ్ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నందున అది ముగిసిన తర్వాతనే అతడితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జై షా పేర్కొన్నాడు.

మరోవైపు టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ గురించి కూడా జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న టీ20 ప్రపంచకప్​లో రోహిత్ ఆడుతాడా లేదా అన్న విషయం గురించి గ్యారెంటీ ఇవ్వలేమని జైషా తెలిపాడు. ఇప్పుడు ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? ''జూన్ లో టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. అంతకంటే ముందు ఐపీఎల్, అఫ్గానిస్థాన్​తో సిరీస్ ఉంటాయి. అప్పటిలోపు ఓ మంచి నిర్ణయం తీసుకుంటాం'' అని జైషా పేర్కొన్నాడు.

మరోవైపు హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి హెల్త్​ అప్​డేట్ ఇచ్చారు. "ప్రస్తుతం హార్దిక్ ఎన్​సీఏ పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు కోలుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అఫ్గానిస్థాన్​తో జరగనున్న సిరీస్ కంటే ముందే హార్దిక్ కోలుకుంటాడు. షమి అయితే సౌతాఫ్రికా సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నాడు. త్వరలో అతడు ఎన్​సీఏకి వెళ్తాడు. త్వరలోనే అతడు కూడా కోలుకుంటాడు'' అని జై షా అన్నారు.

ఇక ఈ పొట్టి ప్రపంచకప్​నకు మరో ఆరు నెలలే సమయం ఉండడం వల్ల, జట్టు కూర్పుపై మేనేజ్​మెంట్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం బీసీసీఐ, ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విరాట్ మూడో స్థానంలో బ్యాటింగ్​ చేసేవాడు. అయితే ఇప్పుడు విరాట్​ కాకుండా, ఈ స్థానంలో మరో బ్యాటర్​ను ఆడించాలని చూస్తుందట బీసీసీఐ. ఈ క్రమంలో మేనేజ్​మెంట్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఇషాన్​ 2021 టీ20 వరల్డ్​కప్​లో కూడా ఆడాడు. అతడి కెరీర్​లో ఇప్పటివరకు 32 టీ20 మ్యాచ్​లు ఆడాడు. అందులో 124.37 స్ట్రైక్ రేట్​తో 796 పరుగులు చేశాడు. దీంతో ఇషాన్ 2024 వరల్డ్​కప్​లో మూడో స్థానంలో కీ రోల్​ ప్లే చేస్తాడని మేనేజ్​మెంట్ భావిస్తోందట. అయితే గత ఏడాది కాలంగా విరాట్ టీ20 క్రికెట్ ఆడకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్- 33మంది ప్లేయర్లతో టీమ్ఇండియా- ఏ టోర్నీకైనా రెడీ!

డ్రెస్సింగ్ రూమ్​లో ఎమోషన్స్​ - ఆ రోజు కోహ్లి, రోహిత్‌ ఏడ్చారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.