Rohit Sharma On CapeTown Pitch : కేట్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది టీమ్ఇండియా. 7 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. పేస్‌కు ఈ పిచ్ విపరీతంగా అనకూలించింది. ఈ విషయంపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. భారత్‌లోని పిచ్‌ల గురించి మాట్లాడకుండా ఉంటే కేప్‌టౌన్ పిచ్‌పై ఆడేందుకు తనకేమీ ఇబ్బంది ఉండదని అన్నాడు. భారత్ పిచ్‌ల గురించి మాడ్లాడే విషయంలో నోరు మూసుకోవాలని అసహనం వ్యక్తం చేశాడు.
-
1⃣-1⃣
— BCCI (@BCCI) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
A well-fought Test Series between the two teams comes to an end 👏👏#TeamIndia | #SAvIND pic.twitter.com/pTsYsYoKGt
">1⃣-1⃣
— BCCI (@BCCI) January 4, 2024
A well-fought Test Series between the two teams comes to an end 👏👏#TeamIndia | #SAvIND pic.twitter.com/pTsYsYoKGt1⃣-1⃣
— BCCI (@BCCI) January 4, 2024
A well-fought Test Series between the two teams comes to an end 👏👏#TeamIndia | #SAvIND pic.twitter.com/pTsYsYoKGt
'ఈ టెస్టులో ఏం జరిగిందో, పిచ్ ఎలా ప్రవర్తించిందో అందరూ చూశారు. ఇండియాకు వెళ్లినప్పుడు అక్కడి పిచ్‌ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకుని ఉంటే, ఇలాంటి పిచ్‌పై ఆడేందుకు నిజంగానే నాకెలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పిచ్ చాలా ప్రమాదకరంగా ఉంది. మాకు పెద్ద సవాలు విసిరింది. భారత్ పిచ్‌లపై కూడా ఇలాంటి సవాలే ఉంటుంది. మేము టెస్టు క్రికెట్ ఆడేందుకు వచ్చాం. పిత్ ఎలా ఉన్నా ఆడాలి. కానీ భారత్‌లో తొలి రోజు నుంచే స్పిన్ తిరిగితే అప్పుడందరూ ఏదేదో మాట్లాడతారు. మొదటి రోజు నుంచి బంతి సీమ్ అయితే పర్వాలేదు. కానీ బంతి తిరిగితే మాత్రం ఒప్పుకోరా? ఈ విషయంలో తటస్థంగా ఉండాలి. పిచ్‌లకు రేటింగ్ ఇచ్చేటప్పుడు రిఫరీలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి' అని రోహిత్ శర్మ చెప్పాడు.
హోస్ట్ దేశాన్ని కాకుండా పిచ్‌ను చూసి రేటింగ్ ఇవ్వాలని రోహిత్ శర్మ పిచ్ రిఫరీలకు సూచించాడు. కేప్‌టౌన్ పిచ్‌కు ఎలాంటి రేటింగ్ ఇస్తారో చూడాలని ఉంది అన్నాడు. ఏదేమైనా ఇది మా అత్యుత్తమ టెస్టు మ్యాచ్ విజయాల్లో ఒకటని, గతంలో ఇక్కడ ఎప్పుడూ గెలవలేదని తెలిపాడు. అందుకే ఈ గెలుపు అత్యుత్తమంగా నిలిచిపోతుంద అన్నాడు. ఆస్ట్రేలియాకు పెట్టని కోట అయిన గబ్బాలోనూ ఆ జట్టును ఓడించామని, ఆ మ్యాచ్ గెలిచిన తీరు కూడా ముఖ్యమే రోహిత్ అన్నాడు.
మ్యాచ్ సాగిందిలా!
- దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 55-10 (23.2 ఓవర్లు)
- భారత్ తొలి ఇన్నింగ్స్ : 153-10 (34.5 ఓవర్లు)
- దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 176-10 (36.5 ఓవర్లు)
- భారత్ రెండో ఇన్నింగ్స్ : 80-3 (12 ఓవర్లు)