ETV Bharat / sports

'రోహిత్​కు ఇదే లాస్ట్​ వరల్డ్​కప్​​- విరాట్​ ఆ రికార్డు బ్రేక్​ చేయడం ఖాయం!' - రోహిత్​​ కెరీర్​పై కోచ్​ దినేశ్​ లాడ్​ కామెంట్స్​

Rohit Sharma Last World Cup : టీమ్​ఇండియా సారథి రోహిత్​ శర్మ, పరుగులు వీరుడు విరాట్​ కోహ్లిపై పలు ఆసక్తికర కామెంట్స్​ చేశాడు హిట్​మ్యాన్​ వ్యక్తిగత కోచ్‌ దినేశ్‌ లాడ్‌. ఇంతకీ ఏమన్నాడంటే..

Rohit Sharma Last World Cup Virat 50th ODI Century
Rohit Sharma Last World Cup Coach Dinesh Lad Comments
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 6:01 PM IST

Rohit Sharma Last World Cup : టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, కింగ్​ విరాట్​ కోహ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్​ వ్యక్తిగత కోచ్​ దినేశ్​ లాడ్​. ఓ ఇంటర్వ్యూలో రోహిత్‌ వయసు, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్​కు ఉన్న విజయావకాశాలపై మాట్లాడాడు. 'రోహిత్​కు ఈ వరల్డ్​కప్పే చివరిది కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 36 ఏళ్లు. మళ్లీ వచ్చే ప్రపంచకప్​ నాటికి అతడికి 40 సంవత్సరాలు నిండుతాయి. టీమ్​ఇండియా ఆటగాళ్లు ఆ వయసులో అంతర్జాతీయ టోర్నీలు ఆడతారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఈ విషయం రోహిత్​కు కూడా తెలుసు. అందుకని ఈసారి ఎలాగైనా దేశం కోసం ప్రపంచకప్​ను ముద్దాడాలని హిట్​మ్యాన్​ ఉవ్విళ్లూరుతున్నాడు' అని దినేశ్​ లాండ్. మరోవైపు కోహ్లి ఆటతీరుపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు లాడ్. 'ప్రస్తుతం విరాట్​ దూకుడు చూస్తుంటే.. ఇదే వరల్డ్​కప్​లో అతడు తన 50వ వన్డే సెంచరీని పూర్తి చేస్తాడేమో అనిపిస్తోంది' అని చెప్పాడు.

  • #WATCH | Indian Captain Rohit Sharma’s coach Dinesh Lad says "There are chances that this can be the last World Cup for Rohit Sharma. He is 36 years old and in the next 4 years, he will be 40. Usually, Indian cricketers don't play at that age. He wants to win the World Cup for… pic.twitter.com/kjeC3v05me

    — ANI (@ANI) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అటు సెంచరీలు.. ఇటు వికెట్లు..
ఈ టోర్నీలో టీమ్​ఇండియా జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో భీకరమైన ఫామ్​ను కొనసాగిస్తోంది. అటు బ్యాటర్లు సెంచరీలు, హాఫ్​ సెంచరీలతో చెలరేగుతుంటే.. ఇటు బౌలర్లు సైతం తగ్గేదేలే అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. టాప్​ ఆర్డర్​లో ఉన్న 5 బ్యాటర్లలో ఇప్పటికే నలుగురు సెంచరీలు కూడా బాదారు. ఈ మెగా పోరులోనే విరాట్​ 2 సెంచరీలు బాది తన 49వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా రోహిత్‌, శ్రేయస్‌, రాహుల్‌ సైతం తలో సెంచరీ నమోదు చేశారు. శుభ్‌మన్‌ గిల్‌ సైతం 3 హాఫ్​ సెంచరీలు బాది ఆకట్టుకుంటున్నాడు. ఇక రాణించాల్సిందల్లా సూర్యకుమార్‌ యాదవ్​ ఒక్కడే.

బౌలింగ్​లో భళా..
ప్రత్యర్థ బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు టీమ్​ఇండియా పేస్​ త్రయం. అద్భుతమైన బౌలింగ్​ షాట్స్​తో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తున్నారు. జస్ప్రీత్​ బుమ్రా, మహమ్మద్​ షమీ, మహమ్మద్​ సిరాజ్​లు కలిసి ఏకంగా 45 వికెట్లు పడగొట్టారు. స్పిన్​ ద్వయం రవీంద్ర జడేజా, కుల్దీప్​ యాదవ్​లు కూడా బౌలింగ్​లో భేష్​ అనిపించుకుంటున్నారు.

బలంగా భారత్​..
ఫీల్డింగ్‌లోనూ మనవాళ్లు బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. దీంతో స్వల్ప స్కోర్​లకే ఆలౌట్​ అవుతున్నాయి ప్రత్యర్థి జట్లు. ఇలా అన్ని అంశాల్లోనూ బలంగా ఉన్న టీమ్​ఇండియా ఈసారి కచ్చితంగా వరల్డ్​కప్​ను దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్​ లవర్స్​. ఇక భారత్​ తన తదుపరి మ్యాచ్​ నవంబర్​ 15న ఆడనుంది. ముంబయి వేదికగా జరగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. నవంబర్​ 19న ఫైనల్​ పోరు జరగనుంది.

అన్ని విభాగాల్లో దుర్భేధ్యంగా టీమ్ఇండియా- వెంటాడుతున్న సెమీస్‌ ఫోబియా!

రూ2వేల టికెట్ రెండున్నర లక్షలకు- సెమీస్ క్రేజ్​ను క్యాష్ చేసుకుందామని అడ్డంగా దొరికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.