ETV Bharat / sports

నెట్స్​లో శ్రమిస్తోన్న ధోనీ, రోహిత్.. వీడియో చూసేయండి!​ - ఐపీఎల్ 2021 ధోనీ ప్రాక్టీస్

ఐపీఎల్​ 14వ సీజన్(ipl 2021 schedule)​ రెండో విడత కోసం సిద్ధమవుతున్నాయి జట్లు. సెప్టెంబర్ 19న ముంబయి-చెన్నై(mi vs csk 2021) మధ్య జరగనున్న మ్యాచ్​తో సెకండ్ ఫేజ్ మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ప్రాక్టీస్​లో మునిగిపోయాయి.

Rohit Sharma Dhoni
ధోనీ, రోహిత్
author img

By

Published : Sep 17, 2021, 8:45 PM IST

ఐపీఎల్-2021 సెకండ్ ఫేజ్(ipl 2021 schedule)​​ రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్(mi vs csk 2021) మధ్య మ్యాచ్​తో ఈ లీగ్ రెండో దశ మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్​లో మునిగి తేలుతున్నాయి. నెట్స్​లో బ్యాట్స్​మెన్, బౌలర్లు చెమటోడుస్తున్నారు. ముఖ్యంగా ముంబయి-చెన్నై తొలి పోరు కోసం సిద్ధమవుతున్నాయి. మొదటి మ్యాచ్​లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్​లు సోషల్ మీడియాలో ఏం షేర్ చేశాయో చూద్దాం.

ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్​ నెట్ సెషన్​లో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్(sachin tendulkar latest news) సందడి చేశారు. ఆటగాళ్లకు సూచనలిస్తూ, వారితో సరదాగా గడిపారు. అలాగే విండీస్​ విధ్వంసకర వీరుడు పొలార్డ్​.. ప్రాక్టీస్ షురూ చేశాడు. కరీబియన్ లీగ్ ముగించుకుని వచ్చిన ఇతడు గురువారమే దుబాయ్​లో అడుగుపెట్టాడు. అలాగే రోహిత్(rohit sharma practice)​తో పాటు మిగతా ఆటగాళ్లు ప్రాక్టీస్​ చేస్తున్న వీడియోలను విడుదల చేసింది ఫ్రాంచైజీ.

చెన్నై సూపర్ కింగ్స్

విండీస్​ క్రికెటర్ బ్రావో, దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ దుబాయ్​లో అడుగుపెట్టిన వీడియోను షేర్ చేసింది ఫ్రాంచైజీ. ఎమోజీలకు సంబంధించి ఆటగాళ్లు గేమ్ ఆడిన ఓ సరదా వీడియోను పోస్ట్ చేసింది. అలాగే ప్రాక్టీస్​లో ధోనీ(dhoni practice for ipl 2021) ఆడిన అన్ని షాట్లను ఓ వీడియోగా రిలీజ్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: తెరపైకి కోహ్లీ-రోహిత్ విభేదాలు.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.